iDreamPost
android-app
ios-app

కాలం మారింది !! గవర్నమెంట్ ఆస్పత్రిలో డిప్యూటీ కలెక్టర్ ప్రసవం

కాలం మారింది !! గవర్నమెంట్ ఆస్పత్రిలో డిప్యూటీ కలెక్టర్ ప్రసవం

ఆమె ఓ డిప్యూటీ కలెక్టర్ , తన ఆరోగ్యం కోసం ఎంతైనా వెచ్చించే స్థోమత, ఇంకా ప్రభుత్వ సౌకర్యాలు బోలెడు. ఇంకా ఫోన్ చేసి పిలిస్తే పెద్ద పెద్ద డాక్టర్లే ఇంటికొచ్చి చికిత్స చేస్తారు.. కానీ ఆమె అలా చేయలేదు. నేరుగా ఆధార్ కార్డ్ తీసుకుని విజయనగరం జిల్లా ప్రధాన వైద్యశాలకు వెళ్లారు. సాధారణ మహిళ మాదిరిగానే లైన్లో నిలబడి పేరు నమోదు చేయించుకుని ప్రసూతి వార్డులో చేరారు. డాక్టర్లు, నర్సులు ఆమెను మామూలు వ్యక్తిగానే భావించి తమ రేగులర్ పద్ధతుల్లోనే చికిత్స ప్రారంభించారు. అర్థరాత్రి ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమవగా అక్కడి సిబ్బంది ఆమెను కంటికిరెప్పలా చూసుకున్నారు. కాసేపటికే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

ఆ తరువాత కాసేపటికి ఆమె ఎవరో కాదని విజయనగరం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, ఆర్డీవో హేమలత అని తెలుసుకున్నారు. ఆయినా వారు కొత్తగా అమెకోసం యేమి చేసింది లేదు. మిగతా గర్భిణులకు ఎలాంటి సౌకర్యాలు, సేవలు అందించారో ఈమెకూ అలాగే పరిచర్యలు చేశారు. ఆ తరువాత ఆర్డీవో హేమలత మాట్లాడుతూ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో సేవలు బాగుంటాయని ప్రజలకు నమ్మకం కలిగించడానికే తాను ఇక్కడ చేరానని, డాక్టర్లు, నర్సులు అసమానమయిన సేవలతో ప్రజలను ఆదరిస్తున్నారని , ప్రజలు కూడా ప్రభుత్వ ఆస్పత్రులమీద నమ్మకం ఉంచాలన్నారు…

అప్పటికి, ఇప్పటికి ఎంత తేడా !!

ఇక రెండు మూడేళ్ళ కిందట గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఎలుకలు కొరికేయగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన, ఇంకా వందలాది 108 వాహనాలు మూలకు చేరిన పరిస్థితులను ప్రజలు గుర్తు చేసుకుంటూ రోజులు మారాయని , ఆనాటి కి ఈనాటికి బోలెడు మార్పు వచ్చిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు, సౌకర్యాలు ఏ కార్పొరేట్ ఆస్పత్రులకు తీసిపోవని అభిప్రాయపడుతున్నారు