iDreamPost
iDreamPost
వైజాగ్, మధురవాడలో వధువు సృజన కేసులో మిస్టరీ వీడినట్లే. పెళ్లి ఆపాలనుకొనే ప్రయత్నంలో ఆమె ప్రాణాలనే కోల్పోయింది. ఎందుకలా చేసింది? పెళ్లంటే ఇష్టంలేదా? ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చేశారు. పెళ్లి మండపంలో వధువు కుప్పకూలడంతో, అనుమాదస్పద కేసుగా నమోదు చేశారు. సృజన ఫోన్ కాల్స్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ లను దర్యాప్తు చేశారు.
సృజనకు అదే విశాఖలోని పరవాడకు చెందిన తోకాడ మోహన్ తో ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అందుకే పెళ్లికి మూడు రోజుల ముందుకూడా, ఆమె అతనితో చాట్ చేసింది. ఈ పెళ్లి నాకు ఇష్టంలేదు, వచ్చి తీసుకెళ్లమని సృజన కోరింది. అందుకే తాను సిద్ధమేకాని, ఇంకా సెటిల్ కాలేదని, మరికొంత సమయం కావాలని కోరాడు.
ఈలోగా సృజనకు ఈనెల 11వ తేదీన పెళ్లి చేయడానికి ఫ్యామిలీ రెడీ అయ్యింది. ఏదోలా పెళ్లిని అపడానికి ప్రయత్నిస్తానని ఆమె మోహన్ కు చెప్పింది. అదుకే విషం తీసుకుంది. కాని డోసు ఎక్కువ అవడంవల్లో, మరో ఇతరకారణంవల్లో, పెళ్లిపీటలమీదనే కుప్పకూలి, ఆతర్వాత హాస్పటల్ లో చనిపోయిందని పోలీసులు అంటున్నారు.