iDreamPost
android-app
ios-app

Vishwak Sen నడిరోడ్డులో న్యూసెన్స్ చేసిన విశ్వక్‌సేన్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు.. హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు..

  • Published May 02, 2022 | 4:29 PM Updated Updated May 02, 2022 | 6:27 PM
  • Published May 02, 2022 | 4:29 PMUpdated May 02, 2022 | 6:27 PM
Vishwak Sen నడిరోడ్డులో న్యూసెన్స్ చేసిన విశ్వక్‌సేన్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు.. హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు..

 

 

యువ హీరో విశ్వక్‌సేన్‌ ఇప్పటివరకు మాస్ సినిమాలతో పలకరించి ఇప్పుడు క్లాస్ సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో మే 6న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు విశ్వక్. ప్రమోషన్స్ లో భాగంగా నడిరోడ్డుపై ఓ యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ రచ్చ రచ్చ చేశాడు.

ఆదివారంనాడు విశ్వ‌క్ సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో ఓ యువ‌కుడితో కలిసి ప్రాంక్ పేరుతో తన సినిమా ప్రమోషన్ చేశాడు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని, పెట్రోల్ పోసుకుంటాను అంటూ విశ్వక్ కారుకి అడ్డంగా పడి హడావిడి చేయగా, విశ్వక్ అతనిని ఆపినట్టు డ్రామా చేశాడు. అయితే ఇదంతా నడిరోడ్డు మీద చేయడంతో అక్కడి జనాలకి ఇబ్బంది కలిగించింది. ఈ వీడియోని చూసిన వారంతా సినిమా ప్రమోషన్స్‌ కోసం మరీ ఇంత చీప్ గా దిగజారాలా? ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్‌ ప్లేస్‌లో ఈ న్యూసెన్స్‌ ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇక ఈ న్యూసెన్స్ ఇవాళ మరింత వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ప్రముఖ లాయర్ అరుణ్ కుమార్ స్పందించి ప్రమోషన్స్ పేరిట ఫ్రాంక్ వీడియో అంటూ పబ్లిక్ లో న్యూసెన్స్ చేసిన విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. హీరో విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని, సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్, పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని, పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించాలని, ఒక హీరో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన యువతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, యూట్యూబ్ లో ఉన్న ఇలాంటి వీడియోలు తీసేయాలని ఆయన హెచ్‌ఆర్సీని కోరారు.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobetcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom