iDreamPost
android-app
ios-app

విశాల్ కూడా నాని దారిలోనే

  • Published Sep 02, 2020 | 5:19 AM Updated Updated Sep 02, 2020 | 5:19 AM
విశాల్ కూడా నాని దారిలోనే

థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిష్చితి కొనసాగుతోంది కాబట్టి నిర్మాతల డిజిటల్ అడుగులు ఒక్కొక్కటిగా అటు వైపు పడుతున్నాయి. నాని వి ఇప్పటికే శ్రీకారం చుట్టేయగా నెక్స్ట్ సిరీస్ లో నిశ్శబ్దం, మిస్ ఇండియాలు ఉన్నాయని ఇప్పటికే టాక్ ఉంది. స్టార్లు ఉన్న సినిమాలైతే రెస్పాన్స్ భారీగా ఉంటుంది కాబట్టి హక్కుల కోసం పెద్ద మొత్తాల పెట్టేందుకు సదరు సంస్థలు వెనుకాడటం లేదు. తాజాగా విశాల్ చక్ర కూడా ఓటిటికే ఓటు వేసినట్టుగా చెన్నై రిపోర్ట్. జీ 5 ద్వారా ఇప్పటికే భారీ మొత్తానికి డీల్ కుదిరిందంట. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేయొచ్చనే దాని మీద క్లారిటీ లేదు. ఇప్పటిదాకా తమిళ పరిశ్రమలో ఓటిటి కదలిక అంతగా లేదు.

సూర్య ఆకాశమే నీ హద్దురా డేట్ అఫీషియల్ గా ఇచ్చేశాక అక్కడి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. స్థానికంగా ప్రభుత్వం హాళ్లు తెరిచేందుకు అనుకూలంగా లేకపోవడంతో ఎందరో నిర్మాతలు సేఫ్ గేమ్ కోసం డిజిటల్ కు జై కొడుతున్నారు. అందులో భాగంగానే చక్రకు రూట్ క్లియర్ అయినట్టుగా సమాచారం. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ ఇందులో హీరోయిన్ గా నటించగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతం కూడా ఆకర్షణగా నిలవబోతోంది. దీని తాలుకు ప్రకటన వచ్చాక మరికొందరు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టీ ప్లెక్సులు గవర్నమెంట్ కు ఎన్ని వినతులు పెట్టుకున్నా ఇప్పటికైతే ఎలాంటి స్పందన లేదు.
సేవ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో వర్చువల్ ఉద్యమాలు సాగుతున్నా వాటి ప్రభావం ఎంత ఉంటుందన్నది అనుమానమే.

ఈ క్రమంలో ప్రేక్షకులు సైతం గత ఆరు నెలలుగా ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించడానికి విపరీతంగా అలవాటు పడ్డారు. మూడు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో చందా కడితే చాలు ఏడాది పొడవునా ఎంటర్ టైన్మెంట్ దొరుకుంటుండటంతో సగటు మధ్య తరగతి జీవులు సైతం వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకే చక్ర లాంటి సినిమాలు మరిన్ని వస్తే మరింత ఊపు వస్తుంది. ఆ మధ్య తెలుగు మార్కెట్ లో పట్టు కోల్పోయిన విశాల్ అభిమన్యుడుతో సూపర్ షిట్ అందుకుని పందెం కోడి 2తో కమర్షియల్ గా సేఫ్ అయ్యాడు. అందుకే చక్ర మీద అంచనాలు బాగానే ఉన్నాయి. సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందిన చక్ర అదే రూట్ల్లో రిలీజ్ కావడం విచిత్రమే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.