iDreamPost
iDreamPost
గ్రామసచివాలయం అభ్యర్థులకు ఇది శుభ వార్త. గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిపోయిన 25వేల పోస్టుల భర్తీకి ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ 15 మార్కులు అదనంగా కలిపి ఈ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించింది. సీఎంవో, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు బుధవారం జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా పోస్టుల నియామకంపై ఆదేశాలిచ్చారు.