iDreamPost
android-app
ios-app

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌

  • Published Jul 10, 2020 | 3:28 AM Updated Updated Jul 10, 2020 | 3:28 AM
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌

ఉత్తరప్రదేశ్ లో సంచలన గ్యాంగ్ స్టర్ చివరకు పోలీసుల తూటాలకు బలయ్యాడు. 8 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడిని ఎన్ కౌంటర్ చేశారు. నిన్న మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఓ ఆలయంలో పట్టుబడిన వికాస్ ని యూపీ తీసుకొస్తుండగా మార్గం మధ్యలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఉజ్జయిని నుంచి కాన్పూర్ వస్తున్న మార్గం మధ్యలో కాన్వాయ్ వాహనం ప్రమాదానికి గురయినట్టు పోలీసులు తెలిపారు. ఆ వెంటనే వారి నుంచి తప్పించుకునేందుకు వికాస్ దుబే ప్రయత్నం చేయడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ హతం అయినట్టు ప్రకటించారు.

ఇప్పటికే ఈ కేసు దేశమంతా చర్చనీయాంశం అయ్యింది. గత శుక్రవారం నాడు కాన్పూర్ సమీపంలోని బాక్రా గ్రామంలో వికాస్ దుబే కార్యకలాపాలపై వచ్చిన పిర్యాదులతో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న దుబే , అతని అనుచరులు కలిసి పోలీసులపై తిరగబడ్డారు దాంతో ఆ కాల్పుల్లో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు మరణించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో రహస్యంగా దక్కున్న నిందితుడిని ఎట్టకేలకు నిన్న ఉదయం పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

నిందితుడిని విచారణ నిమిత్తం తిరిగి కాన్పూర్ తీసుకొస్తుండగా మార్గం మధ్యలో జరిగిన ఘటనలతో ప్రధాన నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు ఇప్పటికే అతని అనుచరులను కూడా వివిధ ఎన్ కౌంటర్లలో పోలీసులు మట్టుబెట్టారు. దాంతో పోలీసుల మీద తెగబడిన నిందితుడిని ఖతం చేసిన పోలీసు వర్గాలు ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది.