iDreamPost
android-app
ios-app

విపక్ష మీడియాకు మింగుడుపడని విజయసాయిరెడ్డి పదవి

  • Published Sep 30, 2020 | 6:21 AM Updated Updated Sep 30, 2020 | 6:21 AM
విపక్ష మీడియాకు మింగుడుపడని విజయసాయిరెడ్డి పదవి

పరిపాలనా వ్యవహారాల్లో భాగంగా నిన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద పీట వేసింది .

గత కొంతకాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఢిల్లీలో పెద్దల అపాయింట్మెంట్ దొరకట్లేదని , ఢిల్లీ పెద్దలు పిలిపించి మందలించారని అక్షింతలు వేశారని , రాష్ట్రం తరుపున చేసిన విజ్ఞప్తులు పట్టించుకోకుండా పక్కన పెట్టారని మీడియాలోని ఒక వర్గం చేస్తున్న ప్రచారాలకు తెర దించుతూ సాక్షాత్తు దేశ ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ పనితీరుని వలంటీర్ల వ్యవస్థ నిర్ణయాల్ని ప్రశంసించటం జరిగింది . అలాగే ఈ రోజు కేంద్రం ప్రకటించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుల ఎంపికలో రాష్ట్ర వైసీపీ ఎంపీలకు కేంద్రమిచ్చిన ప్రాధాన్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సహృద్భావాన్ని ప్రతిబింబించే విధంగా ఉండటం విశేషం .

Also Read:లోకేష్‌.. అప్పుడు పడవలన్నారు మరి ఇప్పుడేమంటారు?

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుండి ఆ కుటుంబం వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి , వైసీపీ ఆవిర్భావం తర్వాత కీలక నేతగా వ్యవహరించారు . ముఖ్యంగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తర్వాత జాతీయ స్థాయిలో వైసీపీ పార్టీకి సత్సంబంధాలు ఏర్పడటానికి , కేంద్రంతో సానుకూల చర్చల ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు బాటలు వేయడానికి కృషి చేసారు . వైసీపీ ప్రభుత్వం తరుపున ఢిల్లీలో ప్రతినిధిగా విశేష గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డిని ప్రస్తుతం ప్రకటించిన పార్లమెంటరీ కమిటీల్లో సముచిత స్థానంతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం .

పార్లమెంటరీ వాణిజ్య శాఖ చైర్మన్ గా విజయసాయిరెడ్డిని మరోసారి నియమించిన కేంద్ర ప్రభుత్వం , రాష్ట్రం నుండి మొత్తం ఎనిమిది మంది వైసీపీ ఎంపీలకు పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా ఎంపిక చేసి స్థానం కల్పించింది . తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఇస్తున్న ప్రాతినిధ్యం ఏమిటో స్పష్టత ఇచ్చింది .

ఆది నుండి వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డికీ , సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇటీవల పొరపొచ్చాలు వచ్చాయని , సాయిరెడ్డికి పార్టీలో ప్రాతినిధ్యం తగ్గించారని , ఇటీవల వైజాక్ పర్యటనలో పక్కన పెట్టారంటూ ప్రతిపక్ష టీడీపీ , కొన్ని మీడియా సంస్థల ద్వారా వైసీపీలో వివాదాలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు కళ్లెం వేస్తూ కీలకమైన వాణిజ్య కమిటీ చైర్మన్ గా విజయసాయిరెడ్డి నామినెట్ కావటం పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాకి మింగుడు పడని అంశంగా చెప్పవచ్చు . స్టాండింగ్ కమిటీల నియామకంలో కేంద్ర ప్రభుత్వానిదే నిర్ణయం అయినా ఆయా పార్టీల అధక్షుల సిఫార్సులు కీలకం అనేది అందరికి తెలిసిన విషయమే. విజయ సాయి రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ నియామకం మరోసారి రుజువు చేస్తుంది. ప్రతిపక్షాలు,కొన్ని మీడియా సంస్థలు లేని విభేదాలను రాయటం ఇప్పటికైనా మానుకోవటం మంచిది.

Also Read:వైఎస్సార్ మీద వేసిన అస్త్రాలే జగన్ మీద సంధిస్తే ఎలా బాబూ..

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఆంద్రప్రదేశ్ ఎంపీలకు చోటు..

ఇక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో చోటు దక్కించుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీ సభ్యులను పరిశీలిస్తే..

– ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,
– పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి .
– హెచ్ఆర్డీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ,
– ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైసీపీ ఎంపీ సత్యనారాయణ,
– రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కోటగిరి శ్రీధర్
– కెమికల్ అండ్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నందిగం సురేష్
– గ్రామీణ అభివృద్ధిశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తలారి రంగయ్యను నియమించారు .

బీజేపీ నుండి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవిఎల్ నరసింహా రావుకు ఆర్ధిక శాఖ స్టాండింగ్ కమిటీలో స్థానం దక్కగా , 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్ కూడా ఇదే కమిటీలో స్థానం దక్కించుకున్నారు . ఇహ టీడీపీ నుండి ఇటీవల అసంతృప్తిగా ఉన్న కేశినేని నానికి వాణిజ్య కమిటీలో, గల్లా జయదేవ్ హెచ్ఆర్డీ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు ..

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBetandyou girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel