iDreamPost
android-app
ios-app

అరవ ఉప్పెన అక్కడి స్టార్ వారసుడితో ?

  • Published Feb 18, 2021 | 5:24 AM Updated Updated Feb 18, 2021 | 5:24 AM
అరవ ఉప్పెన అక్కడి స్టార్ వారసుడితో ?

గత శుక్రవారం విడుదలై అనూహ్య విజయం సొంతం చేసుకున్న ఉప్పెన రికార్డుల పర్వం కొనసాగుతోంది. టాకులు రివ్యూలతో సంబంధం లేకుండా ఫస్ట్ వీక్ లోనే పెట్టుబడితో పాటు లాభాలను వెనక్కు ఇచ్చి హీరో హీరోయిన్ డైరెక్టర్ ముగ్గురు డెబ్యూలకు సెన్సేషనల్ బిగినింగ్ గా నిలిచింది. కథలో చాలా సున్నితంగా అనిపించే కీలకమైన పాయింట్ ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయాలను పూర్తిగా పోగొడుతూ ఫైనల్ గా ఘన విజయం సొంతం చేసుకుంది. రేపు నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్న ఈ వీకెండ్ కూడా ఉప్పెన కంట్రోల్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకో వారం గట్టిగా నిలబడితే మరికొన్ని రికార్డులు సొంతం అవుతాయి.

ఇదిలా ఉండగా ఇలాంటి స్టోరీలను బాగా రిసీవ్ చేసుకునే తమిళనాట దీని రీమేక్ ఎవరు చేస్తారనే అంచనాలు చెన్నై ఇండస్ట్రీలో అప్పుడే మొదలయ్యాయి. స్టార్ హీరో విజయ్ వారసుడు జేసన్ సంజయ్ ని లాంచ్ చేసేందుకు ఇదే బెస్ట్ ప్రాజెక్ట్ అని విజయ్ సేతుపతి ప్రత్యేకంగా రికమండ్ చేశాడంట. అంతేకాదు ఉప్పెన రీమేక్ హక్కులు కొనేసి తన వద్దే అట్టిపెట్టుకున్నట్టు సమాచారం. ఒకవేళ సంజయ్ వద్దు అనుకుంటే ఇంకో యూత్ హీరో ఎవరితో అయినా చేయించాలని విజయ్ సేతుపతి ప్లాన్ చేసినట్టుగా వినికిడి. విలన్ పాత్ర మటుకు అక్కడ కూడా తనే చేయాలని ముందే డిసైడ్ అయ్యాడని తెలిసింది. అంతగా క్యారెక్టర్ నచ్చేసింది.

దీనికి సంబంధించిన క్లారిటీ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సంజయ్ ని ఇప్పుడే లాంచ్ చేయాలా వద్దా అనే విషయంలో విజయ్ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. తనే ఇంకా భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. యూత్ హీరో పాత్రలే బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. అలాంటప్పుడు ఇంకొంత కాలం ఆగాలనే ఆలోచన కూడా లేకపోలేదని అతని సన్నిహితుల మాట. ఉప్పెన లాంటి సబ్జెక్టు అందులోనూ తీరప్రాంతం కథ కాబట్టి అక్కడి జనానికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఉప్పెన మీద నమ్మకంతో విజయ్ సేతుపతి అది షూటింగ్ దశలో ఉండగానే రైట్స్ కొనేశారు. చూద్దాం ఏం జరుగుతుందో