iDreamPost
android-app
ios-app

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకున్నా వెంకయ్యనాయుడుకి కరోనా సోకింది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ మంగళవారం ఉదయం వెంకయ్యనాయుడు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్దారణ కాగా ఆయన భార్య ఉష నాయుడికి మాత్రం కరోనా నెగెటివ్ గా తేలింది. కరోనా సోకినట్లు తేలడంతో వెంకయ్యనాయుడు హోం క్వారెంటయిన్ లోకి వెళ్లిపోయారు. గతంలో తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి కరోనా విషయంలో జాగ్రత్తలు చెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కరోనా సోకడం గమనార్హం. ఆయన కరోనా బారినుండి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.