iDreamPost
iDreamPost
శాసన విభాగం, న్యాయ విభాగం, కార్యనిర్వాహణ విభాగం ఈ మూడిటికి ఎవరి పరిధులు వాళ్ళకి విధిస్తూ, ఒకరి పరిధిలోకి మరొకరు చొచ్చుకుని పోకూడదు అని భారత రాజ్యంగం స్పష్టంగా చెబుతుంది. కానీ న్యాయ స్థానాలకు, చట్ట సభలకు నడుమ మొదటి నుండి వివిధ అంశాలపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన రోజు నుంచే కోన్ని శాసన వ్యవహారల్లో కోర్టులు ప్రత్యక్షంగా మితిమీరి జోక్యం చేసుకోవడం పలువురు రాజకీయ విశ్లేషకులని సైతం ఆశ్చర్యపరిచింది.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కోర్టులు వ్యవ్హరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి జగన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం అందులో పలు సంచలన విషయాలు ప్రస్తవించడంతో శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యం పట్ల దేశ వ్యప్తంగా చర్చ మొదలైంది. ఇప్పటికే కోర్టుల పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై కోందరు రాజకీయ ప్రముఖులు పలు సందర్భాల్లో వాళ్ల అభిప్రాయాలు వెళ్లడించగా, తాజాగా ఇదే వ్యవహారంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా స్పందించారు.
శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య సామరస్యపూర్వక సమన్వయం శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి కీలకం అనే అంశంపై గుజరాత్ లోని కేవడియాలో జరిగిన 80వ ఆల్ ఇండీయా ప్రీసీడింగ్ ఆఫీసర్స్ కాంఫరెన్స్ ను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఏదీ ఒకదానిపై మరోకటి గోప్పదని చెప్పుకోకూడదు అని, కానీ ఈ వ్యవస్థల్లో భాగమైన న్యాయ వ్యవస్థ పలు సంధర్భాల్లో తన పరిధి దాటు వ్యవహరిస్తుందనే ప్రత్యకమైన అభిప్రాయాన్ని కోన్ని కోర్టు తీర్పులు కలిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మన దేశంలో అన్నిటికన్నా రాజ్యాంగమే సర్వోనత్తమైందని వెంకయ్య నాయుడు పేర్కోన్నారు. శాసన వ్యవహరాల్లో కోర్టుల జోక్యం పట్ల ఏకంగా ఉపరాష్ట్రపతి స్థాయి వ్యక్తే స్పందించారు అంటే ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుందనే చెప్పాలి.