Idream media
Idream media
అసురన్ కొత్త కథ ఏమీకాదు. పాతదే. శతాబ్దాలుగా జరుగుతున్నదే. మనదేశంలో దళితులు, ఆఫ్రికాలో నల్లవారు, సిరియాలో కుర్దులు. బలహీనుల్ని బలవంతులు పీడిస్తూ ఉంటారు.
ఇది తమిళనాడులోనే జరగలేదు. మన దగ్గర కూడా చుండూరు, కారంచేడు రూపంలో జరిగింది. నిన్నమొన్న కూతురు దళితున్ని పెళ్లి చేసుకుందని అల్లున్ని హత్య చేయించిన తండ్రిని చూశాం.
ఇది తమిళ సినిమానే కానీ, సబ్‌టైటిల్స్ చదవకపోయినా అర్థమవుతుంది. ఎందుకంటే బాధకి భాష లేదు. అది ప్రపంచ భాష. దీన్ని తెలుగులో వెంకటేష్‌తో తీస్తారంటే ఆశ్చర్యమేసింది. వెంకటేష్ మంచి నటుడే. అతను రామానాయుడి కొడుకులా కనిపిస్తాడు కానీ, అగ్రవర్ణాల పీడనకి గురైన ఒక దళిత నిస్సహాయుడిలా కనిపించడు. కారంచేడులో దగ్గుబాటి ఇంటి పేరున్న వాళ్లే నిందితులు. ఆ ఇంటి పేరున్న వెంకటేష్ దళిత బాధితుడిగా నటించాలనుకోవడం ఒక విచిత్రం. “దశ్యం ” రీమేక్ వేరు. దాంట్లో ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా వెంకటేష్ సరిపోయాడు. కానీ అసురన్ వేరు. వెంకటేష్‌తో తీస్తే ప్లాప్ గ్యారంటీ.
అమెజాన్ ప్రైమ్‌లో అసురన్ చూడండి. అది ధనుష్ విశ్వరూపం. ఒకవేళ ఇలాంటి కథని తెలుగు డైరెక్టర్లు ఎవరైనా చెపితే హీరోలు అతన్ని దూరం పెట్టేవాళ్లు. తమిళ్‌లో ఆడింది కాబట్టి ఇక్కడ ఆహా ఓహో అంటున్నారు.
మాసిన చొక్కా, పంచెతో సినిమా అంతా కనిపించడం మన హీరోలకి అర్థం కూడా కాదు. మనకి బిల్డప్ కావాలి.
ఊరందరికి కాళ్లు మొక్కడం అనే సీన్ మనవాళ్లు చేయరు. సినిమా కంటే ఇగోనే ముఖ్యం.
“భూమిని గుంజుకుంటారు, డబ్బుని గుంజుకుంటారు. అందుకే చదువుకో, దాన్ని ఎవరూ గుంజుకోలేరు”…ఈ డైలాగ్ అసురన్ ఆత్మ