Idream media
Idream media
బెంగళూరు అలయన్స్ వర్శిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ డాక్టర్ అయ్యప్ప దొరె(53)ను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆర్‌టీనగర పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విజయపుర జిల్లాకు చెందిన ఆయన ఆర్‌టీ నగరలో 17ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అనేకల్ సమీపంలోని అలయన్స్ వర్శిటీలో ఎనిమిదేళ్లపాటు వైస్ చాన్సలర్స్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో భోజనం చేసి వాకింగ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో అయ్యప్ప ఇంటికి 50 మీటర్ల దూరంలో కాపు కాచిన దుండగులు అయనను అడ్డగించి మారాణాయుధాలతో విచక్షణరహితంగా నరికి చంపారు.