iDreamPost
iDreamPost
వకీల్ సాబ్ మొదటి మూడు రోజులు చెడుగుడు ఆడేశాడు. ఫస్ట్ వీకెండ్ ని అంచనాలకు మించిన వసూళ్లతో హోరెత్తించాడు. మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో అనూహ్యమైన పరిస్థితుల వల్ల బెనిఫిట్ షోలు రద్దు కావడం, టికెట్ ధరల రగడ వల్ల ప్రభావం చెందినప్పటికీ అవేవి వకీల్ ప్రభంజనాన్ని తగ్గించలేకపోయాయి. లెక్కల పరంగా కొంత హెచ్చుతగ్గులు ఉన్నాయి కానీ బయ్యర్లు ఏదైతే కోరుకున్నారో ఆ అంచనాలకు అనుగుణంగానే పవన్ సినిమా పెర్ఫార్మ్ చేయడం విశేషం. ముఖ్యంగా రివ్యూలు, పబ్లిక్ టాక్ పాజిటివ్ గా రావడం వకీల్ సాబ్ కు చాలా ప్లస్ అయ్యింది. మహిళలు కూడా థియేటర్లకు రావడం ఓ మంచి పరిణామం.
వారాంతాన్ని వకీల్ సాబ్ సుమారుగా 59 కోట్ల 82 లక్షల షేర్ తో ముగించడం విశేషం. కొన్ని సెంటర్లలో బాహుబలి, అల వైకుంఠపురములో రికార్డులకు దగ్గరగా వెళ్లడం గమనార్హం. ఇది సంక్రాంతి లాంటి హాలిడే సీజన్ కాకపోయినా ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం చూస్తే అది పవన్ స్టామినాగా చెప్పుకోవాలి. పింక్ రీమేక్ ని దర్శకుడు వేణు శ్రీరామ్ హ్యాండిల్ చేసిన తీరు ప్రశంసలు దక్కించుకుంటోంది. ఒకవేళ ఫస్ట్ హాఫ్ ను కూడా బాగా బ్యాలెన్స్ చేసి ఉంటే రేంజ్ ఇంకా పెరిగేది. నైజాంలో వకీల్ సాబ్ అరాచకం మాములుగా లేదు. ఒక్క ఆ ప్రాంతం నుంచే 16 కోట్లకు పైగా రాబట్టడం విశేషం. ఇక ఏరియాల వారీగా ఈ విధంగా వచ్చినట్టు చెబుతున్నారు
– ఏరియా వారీగా వకీల్ సాబ్ మొదటి వారాంతం ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
ఏరియా | షేర్ |
నైజాం | 16.30cr |
సీడెడ్ | 8.15cr |
ఉత్తరాంధ్ర | 7.70cr |
గుంటూరు | 5.26cr |
క్రిష్ణ | 3.25cr |
ఈస్ట్ గోదావరి | 4.62cr |
వెస్ట్ గోదావరి | 5.60cr |
నెల్లూరు | 2.49cr |
ఆంధ్ర+తెలంగాణా | 53.37cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 3.15cr |
ఓవర్సీస్ | 3.30cr |
ప్రపంచవ్యాప్తంగా | 59.82cr |
లెక్క గట్టిగానే ఉంది కానీ బ్రేక్ ఈవెన్ చేరాలంటే ఇంకో 30 కోట్ల దాకా రాబట్టాలి. రేపు ఉగాది సెలవు రోజు కాబట్టి ఆదివారం స్థాయి రెస్పాన్స్ ఉంటుందని ట్రేడ్ ఆశిస్తోంది. అదే జరిగితే లాభాలకు చేరుకోవడానికి ఇంకా తక్కువ టైం పడుతుంది. ఎలాగూ శుక్రవారం రావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడటం వకీల్ సాబ్ కు ఎంతమేరకు కలిసి వస్తుందో చూడాలి. ఇప్పటికైతే బుకింగ్స్ బాగున్నాయి కానీ మరీ ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పే స్థాయిలో ఇవి కొనసాగుతాయా అనేది వేచి చూడాలి. 90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న వకీల్ సాబ్ కు ఇప్పుడు రాబోయే వారం రోజులు అంటే ఆదివారం దాకా చాలా కీలకంగా మారబోతున్నాయి