iDreamPost
android-app
ios-app

వకీల్ సాబ్ వీరంగం – మొదటి రోజు వసూళ్లు

  • Published Apr 10, 2021 | 11:14 AM Updated Updated Apr 10, 2021 | 11:14 AM
వకీల్ సాబ్ వీరంగం  – మొదటి రోజు వసూళ్లు

ఊహించినట్టే పవన్ కళ్యాణ్ కం బ్యాక్ సినిమా వకీల్ సాబ్ మొదటి రోజు వసూళ్లలో వీరంగం ఆడేసింది. కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధరల రగడ, బెనిఫిట్ షోల రద్దు లాంటి సమస్యలు ఎదురైనప్పటికీ ఫస్ట్ షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ సాయంత్రం నుంచి వేగం పెరగడానికి తోడ్పడింది. పవన్ కోసం అభిమానులు ఎంతగా తపించిపోయారో థియేటర్ల వద్ద రద్దీ సాక్షిగా ఋజువయ్యింది. చాలా చోట్ల ఎన్ని స్క్రీన్లు వేసినా తక్కువ పడి అదనపు షోలకు డిమాండ్ పెరిగేంతగా పరిస్థితి మారిపోయింది. రష్ దృష్ట్యా ఫ్యామిలీస్ ఇంకా వకీల్ సాబ్ వైపు రాలేదు కాబట్టి రేపటి నుంచి ఆ ట్రెండ్ కూడా మొదలైపోతే కలెక్షన్ల సునామి మాములుగా ఉండదు.

మొదటి రోజు ఏకంగా 36 కోట్ల 46 లక్షల దాకా షేర్ రాబట్టిన వకీల్ సాబ్ గ్రాస్ రూపంలో 52 కోట్లను దాటేసినట్టు ట్రేడ్ టాక్. ఇప్పుడున్న కరోనా భయాల్లో చూసుకుంటే ఇది చాలా పెద్ద మొత్తం. అందులోనూ కర్ణాటకలో యాభై శాతం థియేటర్ ఆక్యుపెన్సీ మధ్య ఫిగర్స్ తగ్గాయి కానీ లేదంటే లెక్కల్లో ఇంకా భారీ వ్యత్యాసం కనిపించేది. నైజామ్ లోనే తొమ్మిది కోట్లకు దగ్గరగా వెళ్లిన పవన్ మేనియా ఈ రోజు రేపు పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకోబోతోంది. సీడెడ్ లోనూ వకీల్ వీరంగం ఆడేశాడు. వీకెండ్ ఇక్కడ కీలకంగా మారబోతోంది. అయితే భారీగా పెంచిన టికెట్ రేట్లు రిపీట్ ఆడియన్స్ ని అడ్డుకుంటున్నాయి. ఇక ఏరియాల వారీగా చూద్దాం

ఏరియా వారీగా వకీల్ సాబ్ మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 

AREA SHARE
నైజాం  8.75cr
సీడెడ్   4.50cr
ఉత్తరాంధ్ర  3.85cr
గుంటూరు   3.94cr
క్రిష్ణ   1.90cr
ఈస్ట్ గోదావరి  3.10cr
వెస్ట్ గోదావరి  4.50cr
నెల్లూరు   1.70cr
Total Ap/Tg  32.24cr
రెస్ట్ అఫ్ ఇండియా 1.82cr
ఓవర్సీస్ 2.40cr
ప్రపంచవ్యాప్తంగా 36.46cr

ఇందులో ఎంజి, అడ్వాన్స్, హైర్ అన్ని పద్దతుల్లో వచ్చిన వసూళ్లను లెక్కేసి జోడించినట్టుగా చెబుతున్నారు. ఎలా చూసుకున్నా ఇది భారీ మొత్తం. సాహో, బాహుబలి, సరిలేరు నీకెవ్వరూ లాంటి బ్లాక్ బస్టర్లను చాలా చోట్ల దాటలేకపోయినప్పటికీ వారం అయ్యాక ఫైనల్ స్టేటస్ ఎలా ఉండబోతోందన్న క్లారిటీ వస్తోంది. ఫస్ట్ హాఫ్ మీద కంప్లైంట్స్ లేకపోతే వకీల్ సాబ్ రేంజ్ ఇంకా పెరిగేది. సెకండ్ హాఫ్ ని నడిపించిన విధానం అభిమానులను విపరీతంగా సంతృప్తి పరిచింది. మరి 16న రావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడిన నేపథ్యంలో వకీల్ సాబ్ రానున్న రోజుల్లో ఇంకెంత రాబడతాడో చూడాలి