iDreamPost
android-app
ios-app

కొత్త ట్రెండ్ కి ‘వి’ శ్రీకారం

  • Published Aug 16, 2020 | 10:58 AM Updated Updated Aug 16, 2020 | 10:58 AM
కొత్త ట్రెండ్ కి ‘వి’ శ్రీకారం

ఇప్పటిదాకా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ కావడం చూశాం కానీ లాక్ డౌన్ వల్ల కొత్తగా రూల్స్ కూడా బద్దలు కాబోతున్నాయి. దానికి నాని వి శ్రీకారం చుట్టబోతోంది. అధికారికంగా ప్రకటించలేదు కానీ సెప్టెంబర్ 5న ‘వి’ డిజిటల్ ప్రీమియర్ ఖాయమని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే ట్రైలర్ కట్ జరుగుతోందని మరో రెండు మూడు రోజుల్లో గ్రాండ్ గా లాంచ్ చేసి అనౌన్స్ మెంట్ ఇస్తారని చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నా ఎవరు మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటిదాకా తెలుగు ఓటిటిలో వచ్చిన వెబ్ సిరీస్ లు, సినిమాలు అన్నీ టాక్ తో సంబంధం లేకుండా బాగానే స్పందన తెచ్చుకున్నాయి. అయితే అద్భుతాలు చేసినవి మాత్రం పెద్దగా లేవు.

స్టార్ హీరోలైతే ఆ కిక్కే వేరు. ఇప్పుడు నాని వి దానికి మొదటి అడుగుగా నిలవబోతోంది. నిర్మాత దిల్ రాజు దీని గురించి ఎక్కడా మాట్లాడటం లేదు సరికదా తన పిఆర్ టీంతో కనీసం ఖండిస్తూ ట్విట్టర్ హ్యాండిల్ లో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి వి గురించి ఇంకెలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. దీనికి రెస్పాన్స్ మాత్రం ఊహించనంత భారీ స్థాయిలో రావడం ఖాయం. పైరసీ బెడద ఉన్నప్పటికీ అమెజాన్ కు ఇండియాలో లక్షల్లో చందాదారులు ఉన్నారు. మల్టీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి కోట్లాది ప్రేక్షకులు వివిధ మార్గాల్లో ప్రైమ్ లోనే సినిమా చూస్తారు. ఎంత లేదన్నా మొదటి రోజు పది మిలియన్ల వ్యూస్ వచ్చినా ఆశ్చర్యం లేదని ఓటిటి ట్రేడ్ టాక్.

నానితో పాటు సుదీర్ బాబు, ఆదితి రావు హైదరి, నివేదా థామస్ లాంటి క్యాస్టింగ్ ఉండటంతో పాటు ఇది క్రైమ్ థ్రిల్లర్ కావడం ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. పాటలు అమిత్ త్రివేది కంపోజ్ చేయడం నార్త్ ఆడియన్స్ ని ఆకర్షిస్తుంది. తెలుగు రాకపోయినా హ్యాపీగా సబ్ టైటిల్స్ తో చూసేస్తారు. సో నాని వి గేమ్ చెంజర్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంవహించిన వి నానికి 25వ సినిమా. ఇంత స్పెషల్ మైల్ స్టోన్ ని థియేటర్లలో సెలబ్రేట్ చేసుకోవాలని అభిమానులు ముచ్చటపడినా ఇప్పుడు ఇంట్లోనే చేసుకోక తప్పదు.కొందరు అబిమాన సంఘాలు ఒకే చోట గుమిగూడి ప్రాజెక్టర్ల సహాయంతో ప్రీమియర్ చూసుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నారట. చూస్తుంటే నాని వి డిజిటల్ లోనూ కొత్త ట్రెండ్ సృష్టించేలా ఉంది