iDreamPost
android-app
ios-app

విషమంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఆరోగ్యం

విషమంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఆరోగ్యం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్యం విషమించింది. కాగా ఈనెల 18న త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన భార్య, కుమార్తెలకు కూడా కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించడంతో డూన్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ సెకండ్ వేవ్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐరోపా దేశాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో బ్రిటన్ కు విమాన రాకపోకలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటివరకు ఇండియాలో 10,208,725 మంది కరోనా వైరస్ బారిన పడగా 147,940 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. 9,781,945 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. కాగా సెకండ్ వేవ్ భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి.