Idream media
Idream media
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద మంజూరైన గృహాల్లో నిర్మాణంలో ఉన్న వాటిలో 70 వేల గృహాల నిర్మాణం డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మున్సిపల్ పరిపాలన, ఏపీటిడ్కో అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అమరావతి సచివాలయంలో పీఎంఏవై పథకంపై అధికారులతో సమీక్షించారు. బ్యాంకు రుణాల కోసం నెలల తరబడి వేచి చూడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా నిధులతో తక్కువ పెట్టుబడితో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
పట్టణాల్లో పీఎంఏవై కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 7 లక్షల గృహాలను కేటాయించగా, 3.93 లక్షల గృహాల నిర్మాణం ప్రారంభమైందని, డిసెంబరులోగా 70 వేల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు చెప్పారు.