iDreamPost
iDreamPost
ఈ ఏడాదిలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా జాతిరత్నాలు, క్రాక్ సరసన నిలిచిన ఉప్పెన ఫైనల్ రన్ ముగిసింది. ఇంకొద్ది రోజుల్లో ఓటిటిలో స్ట్రీమింగ్ జరగబోతున్న నేపధ్యంలో దాదాపు అన్ని సెంటర్లలో ఇప్పటికే సెలవు తీసుకుంది. కొన్ని చోట్ల షిఫ్టింగ్ మీద మరికొన్ని చోట్ల షోల కుదింపు పరిమితుల మధ్య రన్ అవుతోంది. యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే సోషల్ మీడియాలో టీమ్ బాగానే ప్రోమోట్ చేసింది. అంచనాలకు ఎన్నో రెట్లు మించి పెర్ఫార్మ్ చేసిన ఉప్పెన డిజిటల్, శాటిలైట్ లోనూ అదే స్థాయిలో సంచలనాలు రేపే అవకాశాలు ఉన్నాయి. 2021లో ఉప్పెన ఎన్నో సంచలనాలకు వేదికయ్యింది.
ఇక వసూళ్ల లెక్కలు చూస్తే మైత్రి సంస్థ ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పుకున్నప్పటికీ ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు 85 నుంచి 90 కోట్ల మధ్యే ఆగినట్టుగా తెలుస్తోంది. షేర్ 50 కోట్ల మార్కు దాటడం పెద్ద ఫీట్. ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాల్లో ఇంతవరకు ఎవరికీ సాధ్యం కానీ ఫీట్ ఇది. ఇప్పటికీ కొందరు స్టార్లుగా పేరున్న హీరోలకు ఈ మార్కు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ కోణంలో చూసుకుంటే వైష్ణవ్ తేజ్ ఇది గొప్ప డెబ్యూగా నిలిచిపోయింది. గతంలో రామ్ చరణ్, అఖిల్ లు సెట్ చేసిన రికార్డు దాటేయడం కూడా ఘనతగానే చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ కలెక్షన్లు చూద్దాం
ఉప్పెన ఫుల్ రన్ వసూళ్లు:
ఏరియా | షేర్ |
నైజాం | 15.62cr |
సీడెడ్ | 7.79cr |
ఉత్తరాంధ్ర | 8.58cr |
గుంటూరు | 3.0cr |
క్రిష్ణ | 3.21cr |
ఈస్ట్ గోదావరి | 5.08cr |
వెస్ట్ గోదావరి | 2.63cr |
నెల్లూరు | 1.78cr |
ఆంధ్ర+తెలంగాణా | 47.69cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 2.38cr |
ఓవర్సీస్ | 1.42cr |
ప్రపంచవ్యాప్తంగా | 51.49cr |
థియేట్రికల్ బిజినెస్ ప్రకారం చూసుకునే ఇది ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఏకధాటిగా మూడు వారాలు అన్ని సినిమాలను డామినేట్ చేయడం ఉప్పెనకు చాలా ప్లస్ అయ్యింది. మొదటి వారం టికెట్ ధరలు పెంచినప్పటికీ ప్రేక్షకులు కంటెంట్ కి పట్టం కట్టారు. ఇదే కోవలో మరికొన్ని సినిమాలు వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ ఉప్పెన ప్రయోజనం వాటికి కలగలేదు. ఈ దెబ్బకు వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. మరోవైపు కృతి శెట్టికి కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనుకాడటం లేదు. సక్సెస్ ఇచ్చే బ్రేక్ అండ్ కిక్ అలా ఉంటాయి మరి.
Verdict: Block Buster