సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీగా విడుదల కోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ఉప్పెన సినిమా ఎట్టకేలలు ఈ నెల 12న థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా మొదటి ప్రయత్నంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీగా నిర్మించిన ఈ సముద్ర తీరపు ప్రేమకథకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు యుట్యూబ్ లో హిట్టయ్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ హీరోయిన్ కృతి శెట్టి ఇది రిలీజ్ కాకుండానే ఏకంగా నాని లాంటి స్టార్లతో జట్టు కట్టిందంటేనే క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. మరి జూనియర్ ఎన్టీఆర్ ద్వారా విడుదలైన ట్రైలర్ ఎలా ఉందో లుక్ వేద్దాం
ఎక్కడో దూరంగా ఓ సముద్ర తీరపు ఊళ్ళో చేపలు పట్టే యువకుడి(వైష్ణవ్ తేజ్)జీవితంలోకి డిగ్రీ చదివే ఓ పెద్దింటి అమ్మాయి(కృతి శెట్టి)అడుగు పెడుతుంది. అలల హోరులో ఎన్నో ప్రేమ కబుర్లు పాటలు పాడుకుంటారు. పరువంటే ప్రాణమిచ్చే ఆ పిల్ల తండ్రి(విజయ్ సేతుపతి)కి ఈ జంట కంటపడుతుంది. అంతే ఉగ్రరూపం దాలుస్తాడు. వాళ్ళ ప్రేమను చరిత్రలో కలిపేయాలని నిర్ణయించుకుని అతని కుటుంబంతో పాటు ఊరికే నరకం చూపించడం మొదలుపెడతాడు. మరి పరువుకు ప్రేమకు మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారన్నది ఫిబ్రవరి 12న వెండితెర మీద చూడాల్సిందే. ఆ రోజే విడుదల కాబట్టి.
విజువల్స్ ఊహించినట్టే కట్టిపడేసేలా ఉన్నాయి. సముద్రతీరంలో హొయలను, ఓ అందమైన ప్రేమ జంట మధ్య అనుబంధాలను హృద్యంగా చిత్రీకరించినట్టు కనిపిస్తోంది. శామ్ దత్ సైనుదీన్ ఛాయాగ్రహణం, మోనికా రామకృష్ణ ఆర్ట్ డైరెక్షన్ రెండూ సహజత్వం కోసం పోటీ పడ్డాయి.. దానికి దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం కూడా అదే స్థాయిలో తోడవ్వడం ఉప్పెన స్థాయిని పెంచింది. కొత్తవాళ్లే అయినప్పటికీ వైష్ణవ్, కృతిలు చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తున్నారు. మాస్టర్ ని మించిన విలనీని విజయ్ సేతుపతి చూపించాడు. ఏ అంచనాలైతే సినిమా ప్రేమికులు పెట్టుకున్నారో దానికి అనుగుణంగానే ఉప్పెన ట్రైలర్ ఉంది. ఇక 12న థియేటర్లలో ప్రేమ వర్షంలో జనాన్ని తడపడం ఖాయంగానే కనిపిస్తోంది.
Trailer Link @ https://bit.ly/3jsqGYN