iDreamPost
iDreamPost
లాక్ డౌన్ అయ్యాక ఫుల్ కెపాసిటీతో థియేటర్లలో విడుదలైన ఉప్పెన ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కథలో కీలకమైన పాయింట్ గురించి ముందే లీకులు బయటికి వచ్చి సోషల్ మీడియాలో నెగటివ్ డిస్కషన్ జరిగినప్పటికీ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మాండంగా ఆదరించారు. వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి-బుచ్చిబాబు ఈ ముగ్గురు దీని దెబ్బకు ఏకంగా కోట్ల రెమ్యునరేషన్లు తీసుకునే స్థాయికి చేరుకున్నారు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు కూడా ఉప్పెనకు వచ్చిన రెస్పాన్స్ ఎక్కువే. కొద్దిరోజుల పాటు టాప్ త్రీ ట్రెండింగ్ లో ఉంటూ అంచనాలకు తగ్గట్టే దూసుకుపోయింది.
ఇటీవలే ఉప్పెన సినిమా స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జరిగింది. టిఆర్పి రేటింగ్స్ మీద సదరు ఛానల్ గట్టి ఆశలే పెట్టుకుంది. వాటిని మించిపోయేలా ఏకంగా 18.5 రేటింగ్ తో బుల్లితెరపై కూడా ఉప్పెన అదరగొట్టింది. కొత్త హీరో హీరోయిన్ నటించిన ఓ మూవీకి ఈ స్థాయిలో స్పందన దక్కడం అరుదు. ఎందుకంటే రవితేజ క్రాక్ సైతం ఈ మార్కును అందుకోలేదు. ఇదే ఛానల్ లోనే అది కూడా టెలికాస్ట్ అయ్యింది. కానీ ఉప్పెన ఇంత గొప్పగా పెర్ఫార్మ్ చేయడం మాత్రం ఊహించనిది. ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకుండా చూశారని అర్థమవుతోంది.లేకపోతే ఈ రేటింగ్స్ సాధ్యం కాదు
అయితే ఉప్పెన దెబ్బ నేరుగా విజయ్ మాస్టర్ మీద పడింది. అదే సమయంలో జెమిని ఛానల్ పోటీగా ప్రసారం చేసిన ఈ మూవీ కేవలం 4.8 రేటింగ్ తో సర్దుకోవాల్సి వచ్చింది. ఇది చాలా తక్కువ. ఒకవేళ సోలోగా ప్రసారమై ఉంటే ఖచ్చితంగా మెరుగైన నెంబర్ వచ్చేది. అనవసరంగా ఉప్పెనతో పోటీ పడి తగ్గించుకోవాల్సి వచ్చిందని విశ్లేషకుల మాట. ఇదే మాస్టర్ తమిళ ఛానల్ లో వచ్చినప్పుడు అక్కడ 19 దాకా రేటింగ్ తో ఔరా అనిపించింది. కానీ ఇక్కడ ఉప్పెన ముందు తగ్గక తప్పలేదు. ఇప్పుడు అందరి కన్ను జాతిరత్నాలు మీద ఉండబోతోంది. అది ఉప్పెనను దాటుతుందా లేక వెనుకబడుతుందా చూడాలి