iDreamPost
android-app
ios-app

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఆన్ కార్డ్స్

  • Published Mar 17, 2021 | 10:07 AM Updated Updated Mar 17, 2021 | 10:07 AM
బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఆన్ కార్డ్స్

2021లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు అన్నిటిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అంటే ఠక్కున గుర్తొచ్చేవి రెండు. ఉప్పెన, జాతిరత్నాలు. స్టార్లు లేకుండా కేవలం కంటెంట్ నమ్ముకుని ఇద్దరు అప్ కమింగ్ డైరెక్టర్లు చేసిన ప్రయత్నాలకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన దక్కింది. ఉప్పెన ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ సాధించగా జాతిరత్నాలు సైతం కనీసం హాఫ్ సెంచరీ షేర్ ఖాయమనే అంచనాలు ట్రేడ్ లో ఉన్నాయి. ఇప్పటికీ ఈ రెండు తమ రన్ ని చక్కగా కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా జాతిరత్నాలు దెబ్బ పోటీ సినిమాల మీద మాములుగా పడలేదు. నెగటివ్ షేర్లు వచ్చి ఏకంగా వారానికే ఓటిటి రిలీజ్ కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది.

ఈ ముచ్చట్లు కాసేపు పక్కనపెడితే ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ జాతరత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ ఓ ప్రాజెక్ట్ కోసం చేయి కలపబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. బివిఎస్ఎన్ ప్రసాద్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తారట. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ లీకులను బట్టి చూస్తే నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పాలా. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ముందు డిజిటల్ అనుకున్న క్రిష్ తో చేసిన సినిమాకు ఏకంగా భారీ థియేట్రికల్ డిమాండ్ వచ్చి పడింది. సక్సెస్ ఇచ్చే కిక్ అలాంటిది.

ఇక అనుదీప్ సంగతి చూస్తే అందరూ అతని మొదటి సినిమానే జాతిరత్నాలు అనుకునేంత స్థాయిలో దాని ప్రభావం కొనసాగుతోంది. కేవలం కొందరికే అతను గతంలో పిట్టగోడ అనే ఫ్లాప్ మూవీ తీశాడని తెలుసు. ఇప్పుడా విషయం తెలిసి ఆ సినిమా కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఈ కాంబో మాత్రం క్రేజీగా ఉంటుంది. అయితే వైజయంతి బ్యానర్ కే మరో కమిట్ మెంట్ ఇచ్చిన అనుదీప్ నిజంగా ఇది చేస్తాడా లేక కేవలం పుకారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఓకే అనుకున్నా టైం చాలా పట్టేలా ఉంది. సింపుల్ కామెడీతో తెగనవ్వించిన అనుదీప్ రాబోయే సినిమాల్లో ఎలాంటి సబ్జెక్టులు తీసుకుంటాడో