రేపు భారీ ఎత్తున ఉప్పెన థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. ఓపెనింగ్స్ విషయంలో వైష్ణవ్ తేజ్ గతంలో చరణ్, అఖిల్ లు నెలకొల్పిన డెబ్యూ రికార్డులు బద్దలు కొడతాడన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే అనూహ్యంగా అధిక ధరలకు టికెట్లను విక్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనిష్టంగా 50 నుంచి 100 రూపాయల దాకా ఈ పెంపుదల ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ అనుమతులు ఇవ్వడంతో సింగల్ స్క్రీన్లలో సైతం టికెట్ రేట్ 150 రూపాయలు పలుకుతోంది. తెరకు అతి దగ్గరగా సెకండ్ క్లాస్ లో చూడాలన్నా సరే వంద రూపాయలు చెల్లించనిదే నో ఎంట్రీ అంటున్నారు. ఇది ఫాన్స్ కేమో కానీ ప్రేక్షకులకు పెద్ద షాక్.
నిజానికి ఉప్పెన బాహుబలి రేంజ్ వందల కోట్లతో తీసిన సినిమా కాదు. పోనీ రోబో లాగా ఫుల్ గ్రాఫిక్స్ ఉన్నాయా అంటే అదీ కాదు. కేవలం సముద్ర తీరంలో నిర్మించిన ఓ అందమైన ప్రేమకథ. భారీ ఖర్చు అయ్యుండొచ్చు. కాదనడం లేదు. కానీ మరీ ఈ స్థాయిలో అదనంగా ధరలు పెట్టుకునేంత అయితే కాదుగా. పైగా ఇదేమి సంక్రాంతి సీజన్ కాదు. కేవలం గట్టి పోటీ లేదన్న ఒకే కారణంతో ఉప్పెనకు ఎంత పెట్టినా జనం చూస్తారన్న లెక్కనా లేక ఏదైనా ముందుజాగ్రత్తగా చర్యగా ఫస్ట్ వీక్ లోనే వీలైనంత రాబట్టుకునే ప్రయత్నమా తెలియడం లేదు. రేపు ఈపాటికి రిపోర్టులు వచ్చేసి ఉంటాయి కాబట్టి క్లారిటీ వచ్చేస్తుంది.
చాలా చోట్ల మాములు సమయానికి ముందే బెనిఫిట్ షోలు కూడా వేస్తున్నారు. కొన్ని జిల్లా కేంద్రాల్లో ఏకంగా ఉదయం 7 నుంచి 8 మధ్యే షోలు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ ప్రసాద్ లో 8.45కి మొదటి ఆట మొదలయ్యే సమయానికి వాటిలో ఇంటర్వెల్ వస్తుందన్న మాట. ఉప్పెన మీద క్రేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ మరీ ఈ స్థాయిలో ఇలా టికెట్ల దందా ఏంటనేది సామాన్యుడి ప్రశ్న. సరే సినిమా బాగుండి టాక్ బాగా వస్తే పబ్లిక్ ఇదంతా మర్చిపోతారు కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా అంతే సంగతులు. ఓ డెబ్యూ హీరో సినిమాకు అందులోనూ ఫిబ్రవరి లాంటి డ్రై మంత్ లో ఈ స్థాయిలో టికెట్ల పెంపు, ఓపెనింగ్స్ రావడం అంటే రేపు ఏం జరగబోతోందో