iDreamPost
android-app
ios-app

సునామి సంచలనం – ఉప్పెన 7 రోజుల వసూళ్లు

  • Published Feb 19, 2021 | 9:17 AM Updated Updated Feb 19, 2021 | 9:17 AM
సునామి సంచలనం – ఉప్పెన 7 రోజుల వసూళ్లు

మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్, కొత్త భామ కృతి శెట్టిల డెబ్యూ మూవీ ఉప్పెన మొదటి వారం నిన్నటితో పూర్తయ్యింది. మొదటి నాలుగు రోజులు సునామి కలెక్షన్లతో విరుచుకుపడి లాంచింగ్ హీరోల పాత రికార్డులన్నీ బద్దలు కొట్టిన ఈ సినిమా బుధవారం నుంచి నెమ్మదించింది. అయితే అప్పటికే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల్లోకి ప్రవేశించడంతో ఇకపై వచ్చేదంతా బోనస్ గానే పరిగణించాలి. రవితేజ క్రాక్ తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకున్న సినిమా ఇదే, సుదీర్ఘమైన లాక్ డౌన్ తర్వాత తీవ్ర సంక్షోభం నుంచి బయట పడే దిశగా ఇండస్ట్రీ చేసిన ప్రయత్నాల్లో దేశంలో అందరికంటే ముందు టాలీవుడ్ ఉంది.

ఉప్పెన విషయంలో చాలా సానుకూలతలు పని చేశాయి. వంద శాతం సీటింగ్ కు అనుమతులు రావడం, చాలా నెలల క్రితమే దేవిశ్రీ ప్రసాద్ పాటలు బ్లాక్ బస్టర్ కావడం, సోషల్ మీడియాలో కీలకమైన ట్విస్టు గురించి విపరీతమైన ప్రచారం జరగడం బాగా కలిసి వచ్చాయి. అందులోనూ పబ్లిసిటీకి మైత్రి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ గ్రాఫ్ ని పడిపోకుండా చేసింది. ఇప్పుడు కూడా టీమ్ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ హైప్ తగ్గకుండా చూసుకుంటున్నారు. మొత్తం 7 రోజులకు గాను 38 కోట్ల 40 లక్షలు వసూలు చేసిన ఉప్పెన ఫైనల్ రన్ కు వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వేచి చూడాలి. ఏరియాల వారీగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా వారి మొదటి వారం వసూళ్లు :

ఏరియా  షేర్ 
నైజాం  11.52cr
సీడెడ్  5.68cr
ఉత్తరాంధ్ర  6.23cr
గుంటూరు  2.26cr
క్రిష్ణ  2.40cr
ఈస్ట్ గోదావరి  3.67cr
వెస్ట్ గోదావరి  2.09cr
నెల్లూరు  1.28cr
ఆంధ్ర+తెలంగాణా  35.13cr
రెస్ట్ అఫ్ ఇండియా 2.08cr
ఓవర్సీస్ 1.19cr
ప్రపంచవ్యాప్తంగా 38.40cr

ఈ వీకెండ్ నాలుగు సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావం ఉప్పెన మీద ఎంత ఉండబోతోందో చూడాలి. వాటిలో ఒకటో రెండో టాక్ బాగుంటే ఎఫెక్ట్ ఉంటుంది. లేదూ అంటే ఇంకా పికప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. పెంచిన టికెట్ ధరల పరిమితి ముగిసింది కాబట్టి ఇవాళ నుంచి రెగ్యులర్ రేట్లతో టికెట్లు ఉండబోతున్నాయి. ఇది కొంత ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదు. గతంలో అఖిల్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ లు సెట్ చేసిన రికార్డులు అవలీలగా దాటేసిన వైష్ణవ్ తేజ్ మరి మొత్తం పూర్తయ్యేలోపు ఏ బెంచ్ మార్క్ సెట్ చేస్తాడో చూడాలి. ఉప్పెన పుణ్యమాని దర్శకుడు బుచ్చిబాబు మరో రెండు ప్రోజెక్టులకు మైత్రికే లాక్ అయిన సంగతి తెలిసిందే