iDreamPost
android-app
ios-app

కృష్ణా జెడ్పీ చైర్పర్సన్‌ ఉప్పాల హారిక గురించి తెలుసా..?

కృష్ణా జెడ్పీ చైర్పర్సన్‌ ఉప్పాల హారిక గురించి తెలుసా..?

గత ప్రభుత్వాల హయాంలో అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి పాలనలో భాగస్వామ్యం దక్కుతోంది. వెనకబడిన, అట్టడుగు వర్గాలకు అత్యున్నతమైన పదవులు దక్కుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే విధానం కొనసాగుతుండగా,, పరిషత్ ఎన్నికలలోనూ అదే సంపద్రాయం కొనసాగింది.

తాజాగా జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్, చైర్పర్సన్ ల నియామకంలోనూ అదే విధానం పాటించారు. కృష్ణా జిల్లా జెడ్పీ అధ్యక్ష పదవిని బీసీ మహిళకు రిజర్వ్ అవ్వగా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఉప్పాల హారికని జెడ్పి పీఠంపై కుర్చోపెట్టింది.

వైసీపీ సీనియర్ నేత, ఉప్పాల రాంప్రసాద్ కోడలు హారిక గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానం నుంచి 12,744 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఉప్పాల రాంప్రసాద్ , పెడన నియోజకవర్గంలో వైసీపీ బలోపేతం కోసం శ్రమించారు. గత ఎన్నికల్లో ఆయనే వైసీపీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ తర్వాత మారిన రాజకీయ సమీకరణలకు అనుగుణంగా జోగి రమేష్ పోటీ చేసి విజయం సాధించారు.

Also Read : ఆ “తెగ”కు తొలిసారి జిల్లాస్థాయి పదవి

జెడ్పీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన హారిక .. జిల్లా పేరును ఇనుమడింపజేసేలా పనిచేస్తానని తెలిపారు. జిల్లాలో తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్య, వైద్యంపై దృష్టి సారించి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామనని చైర్ పర్సన్ హారిక తెలిపారు. వారంలో ఒకరోజు ప్రజలన నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

జిల్లాలో 43 స్థానాలకు పోలింగ్ నిర్వహించగా 42 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మోపిదేవిలో మాత్రమే టీడీపీ గెలిచింది. దీంతో జడ్పీ చైర్మన్ తోపాటు వైస్ చైర్మన్ పదవులు కూడా వైసీపీకే దక్కాయి. ఇక జడ్పీ వైస్ చైర్మన్లుగా ఎన్నికైన కృష్ణంరాజు నూజివీడు నుంచి 15 వేల పైచిలుక ఓట్లతో గెలిచారు. మరో వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైన శ్రీదేవి, ఇబ్రహీంపట్నం నుంచి 8 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు.

గత పాలకవర్గ జడ్పీ చైర్మన్ గా గద్దె అనురాధ పనిచేశారు. ఆమెది రాజకీయ కుటుంబం. అనురాధ భర్త గద్దె రామ్మెహన్ టీడీపీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓసారి ఎంపీగా రామ్మోహన్ గెలిచారు.

Also Read : మాజీ ఎమ్మెల్యే శ్రీమతికి సిక్కోలు జెడ్పీ పీఠం