iDreamPost
android-app
ios-app

సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్.. ఇంకా వెంటిలేటర్ మీదే.. డాక్టర్లు ఏమన్నారంటే?

సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్.. ఇంకా వెంటిలేటర్ మీదే.. డాక్టర్లు ఏమన్నారంటే?

హైదరాబాద్ లోని దుర్గం కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వేగంగా వెళ్తున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణం కాగా రోడ్డు మీద ఉన్న ఇసుక మీద వేగంగా వెళ్లడం వలన బైక్ స్కిడ్ అయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఇక ఈ ప్రమాదంలో సాయి ధరమ్ కు తీవ్ర గాయాలవడమే కాక అపస్మారక స్థితిలోకి వెళ్లిన తేజ్ ను ముందుగా పోలీసులు మాదాపూర్లోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడికి పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా పలువురు కుటుంబసబ్యులు కూడా వచ్చాక మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.

యాక్సిడెంట్కు గురవడం వల్ల షాక్ అపస్మారక స్థితిలోకి వెళ్లారని, మరే ప్రమాదమూ లేదని వైద్యులు తేల్చిచెప్పారు.ఇక అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ ను వైద్యులు పొద్దుపోయాక విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ హెల్త్ కండిషన్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రోడ్డు ప్రమాదంలో తేజ్ కాలర్ బోన్ విరిగిందని, అది పెద్ద సమస్య కాదని పేర్కొన్న వైద్యులు ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వెంటిలేషన్ మీద చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్న వైద్యులు ఆ విషయం వలన టెన్షన్ పడాల్సింది కూడా లేదని, తేజ్ తప్పనిసరిగా కోలుకుంటారని, ఎవరూ టెన్షన్ పడొద్దు అని చెప్పారు. డ్రైవింగ్ సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ ధరించడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Also Read:మాజీ సీఎం మరదలు – ఫుట్ పాత్ పై దయనీయ స్థితిలో

రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో సాయిధరమ్ తేజ్ బైక్ 150 స్పీడ్ లో ఉందని, ఈ సమయంలో రైడింగ్ జాకెట్, హై ఎండ్ హెల్మెట్, షూ ధరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయన ఎలాంటి మద్యం సేవించలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇక రోడ్డు ప్రమాదం మీద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ ఆరోపణలతో ఐపీసీ 336, 184 ఎంవీ యాక్ట్ కింద సాయి ధరమ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా రాత్రి 8.05 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ప్రమాద స్థలంలో స్పోర్ట్స్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయిధరమ్ తేజ్ వాడిన బైక్ (ట్రియంప్) చాలా ఖరీదైన స్పోర్ట్స్ బైక్, 1160 సీసీ ట్రిపుల్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ ధర సుమారు రూ. 18 లక్షలు. ఇక ఆయన ఆరోగ్యానికి సంబంధించిన మరో బులెటిన్ ఈరోజు ఉదయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.