iDreamPost
android-app
ios-app

RRR : రాజమౌళి భలే ట్విస్టు ఇచ్చారుగా

  • Published Jan 31, 2022 | 11:19 AM Updated Updated Jan 31, 2022 | 11:19 AM
RRR : రాజమౌళి భలే ట్విస్టు ఇచ్చారుగా

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ విడుదల మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28 అని యూనిట్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటిది ఛాన్స్ తక్కువ కాబట్టి రెండో ఆప్షన్ వైపే జక్కన్న మొగ్గు చూపుతారని నిన్నటిదాకా న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా పెద్ద మార్పు చోటు చేసుకోవడం లేటెస్ట్ అప్ డేట్. అధికారికంగా కొత్త డేట్ మార్చి 25 తేదీని కొద్ది నిమిషాల క్రితం ప్రకటించారు. నిజానికి ఆ డేట్ ని ఆర్ఆర్ఆర్ తమిళ హక్కులు కొన్న లైకా సంస్థ నిర్మించిన శివ కార్తికేయన్ డాన్ కోసం ఉదయమే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడా డాన్ వెనక్కు తగ్గడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇదో ఊహించని కొత్త ట్విస్ట్ అనే చెప్పాలి

ఏప్రిల్ చివరి వారం అంటే మరీ ఆలస్యమవ్వడంతో పాటు ఆ నెలలో ఉన్న విపరీతమైన పోటీ వల్ల థియేటర్లను పంచుకోవడంతో పాటు కలెక్షన్ల విషయంలోనూ ఇబ్బందులు కలిగే అవకాశం ఉండటంతో ఆర్ఆర్ఆర్ బృందం నిర్ణయం మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడీ కొత్త డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానయ్య టీమ్ తో పాటు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ లో కన్ఫర్మ్ చేశారు. రాధే శ్యామ్ మార్చి 11ని లాక్ చేసుకునే దిశగా ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడీ ఆర్ఆర్ఆర్ ఇలా ఝలక్ ఇచ్చింది. ఇప్పుడైనా మాట మీద ఉండాలని ఎలాంటి అడ్డంకులు రాకూడదని ఇద్దరు హీరోల అభిమానులు వేడుకుంటున్నారు.

ఒమిక్రాన్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బయట కేసులు తీవ్రంగా లేనప్పటికీ ఇండస్ట్రీ మాత్రం మరోసారి తీవ్రంగా ప్రభావితం చెందుతోంది. ఇప్పటికే సంక్రాంతి సీజన్ ని కోల్పోవడం వల్ల ఎంతలేదన్నా నాలుగైదు వందల కోట్లకు పైగా బిజినెస్ మిస్ అయ్యింది. దేశవ్యాప్తంగా థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడిపేందుకు ఎదురు చూస్తున్న డిస్ట్రిబ్యూటర్లకు ఈ రిలీజ్ డేట్ల తికమక చాలా ఇబ్బంది పెడుతోంది. ముందస్తుగా నిర్మాతలు ఖరారు చేస్తే సర్దుబాట్లు లాంటివి సాధ్యమవుతాయని, అలా కాకుండా రోజుకో డేట్ చెబుతూ కన్ఫ్యూజ్ చేస్తే ఎలా అని వాపోతున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సస్పెన్స్ ప్రస్తుతానికి పూర్తిగా వీగిపోయింది

Also Read : Radhe Shyam : డేట్ లాక్ చేసుకున్న పాన్ ఇండియా సినిమా

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis