iDreamPost
android-app
ios-app

కడంబా అడవుల్లో ఎన్‌కౌంటర్‌ – ఇద్దరు మావోయిస్టుల మృతి

కడంబా అడవుల్లో ఎన్‌కౌంటర్‌ – ఇద్దరు మావోయిస్టుల మృతి

పక్షుల కిలకిలారావాలతో ఉండాల్సిన అడవి కాస్త బుల్లెట్ల చప్పుళ్లతో దద్దరిల్లింది. పచ్చని అడవి నెత్తురోడింది.కడంబా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

వివరాల్లోకి వెళితే కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో శనివారం రాత్రి పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు వచ్చారన్న సమాచారం అందడంతో శనివారం రాత్రి గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ అలియాస్ అడెల్లు తప్పించుకున్నట్లు సమాచారం.. గత ఇరవై ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్ తలపై 20 లక్షల రివార్డు ఉంది. తప్పించుకున్న భాస్కర్ కోసం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు.

భాస్కర్ తో పాటుగా వర్గిస్, కంతి లింగవ్వ,మీనా, ప్రభాత్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వర్గిస్ మరియు మీనా మృతిచెందినట్లు సమాచారం. మావోయిస్టులకు చెందిన నాలుగు సంచులు, రెండు తుపాకులు, విప్లవ సాహిత్యం, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.