రాజకీయ ప్రకటనలుట్విట్టర్ చెల్లు చీటి ఇచ్చింది. వాటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబరు 22 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. నిషేధానికి సంబంధించిన పూర్తి వివరాలను నవంబరు 15న వెల్లడిస్తామని ట్విటర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఒ) జాక్ డోర్సే తెలిపారు. ఫేక్‌న్యూస్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు, రాజకీయ ప్రకటనలపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. అన్ని రాజకీయ ప్రకటనలను తమ వేదిక నుండి నిషేధిస్తున్నట్లు తెలిపారు. “రాజకీయ సందేశాలు ప్రజలకు ‘చేరాలి’ తప్ప వాటిని కొనకూడదు” అని డోర్సే ట్వీట్ చేశారు. తమ నిర్ణయానికి సంబంధించిన మరిన్ని వివరాలను నవంబర్ 15 నే వెల్లడిస్తామన్నారు.