iDreamPost
iDreamPost
సరిగ్గా మరికొద్ది రోజుల్లో విడుదల ఉండగా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమాల్లో విజయ్ నటించిన మాస్టర్ ఒకటి. కార్తీతో ఖైదీ రూపొందించి తెలుగు ప్రేక్షకుల మనసులూ గెలుచుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మీద ఇప్పటికే విపరీతమైన బజ్ ఉంది. తుపాకీ, సర్కార్, విజిల్ వల్ల విజయ్ కు ఇక్కడా డీసెంట్ మార్కెట్ ఏర్పడింది. కరోనా లేకపోతే ఏప్రిల్ 9నే మాస్టర్ సందడి చేసేవాడు. సరే జరిగిందేదో జరిగింది థియేటర్లు తెరిచాక డిసెంబర్ లోనో లేదా జనవరిలోనో రిలీజ్ చేస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్లకు ట్విస్ట్ ఇస్తూ మాస్టర్ విడుదలను ఏకంగా 2021 సమ్మర్ దాకా వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తాజా అప్ డేట్.