కరోనా మహమ్మారి సామాన్యులనే కాకుండా అనేకమంది ప్రముఖులు, రాజకీయ నాయకులకు కూడా సోకుతుంది. ఇప్పటికే అనేకమంది నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. కరోనా సోకినట్లు తేలడంతో ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు..
టీటీడీ చైర్మన్ కరోనా బారిన పడటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తిరుమలలో పలువురు అర్చకులకు,టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా వైవి సుబ్బారెడ్డికి తగిన చికిత్స అందిస్తున్న కారణంగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. ఆయన త్వరలోనే కరోనా బారినుండి కోలుకుని విధులు నిర్వర్తిస్తారని వైద్యులు చెబుతున్నారు