iDreamPost
android-app
ios-app

టీఎస్‌ఆర్టీసీ ప్రైవేటీకరణకు లైన్‌ క్లియర్‌..!

టీఎస్‌ఆర్టీసీ ప్రైవేటీకరణకు లైన్‌ క్లియర్‌..!

తెలంగాణ ఆర్టీసీ ఆర్టీసీ రూట్ల పైవ్రేటీకరణకు లైన్‌ క్లియరైంది. హైకోర్టు శుక్రవారం ఈ మేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మోటార్‌ వెహికల్‌ చట్టం సెక్షన్‌ 102 ప్రకారం రూట్ల ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఇందులో భాగంగా రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన అన్ని పిటీషన్లను కొట్టివేసింది.

5100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగించడం తప్పు కాదని స్పష్టం చేసింది దీనికి సంబంధించి కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వానికి, ప్రైవేటు మధ్య పోటీ ఉన్నప్పుడే లాభాలు సాధ్యమవుతాయని గతంలో చెప్పిన హైకోర్టు ఆ మాటకే కట్టుబడింది. మరోవైపు రూట్ల ప్రైవేటీకరణపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్‌ పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలవడిన నేపథ్యంలో కార్మిక సంఘాలు ఏవిధంగా స్పందిస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే ఉద్యమాన్ని విరమించి విధుల్లోకి చేరతామన్న ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.