టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాతున్నఆ సంస్థ ఎండీ సునీల్ శర్మకు ప్రాంతీయ పిఎఫ్ కార్యాలయం మరో షాక్ ఇచ్చింది. కార్మికుల పిఎఫ్ బకాయిలు చెల్లించాలని ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్, సునీల్ శర్మ కు నోటీసులు జారీ చేశారు.చాలాకాలంగా కార్మికుల ఖాతాల్లో జమ కావాల్సిన పిఎఫ్ జమ కాలేదని, ఆ మొత్తం ఇప్పుడు రూ.760 కోట్లకు చేరిందని తెలిపారు. ఈ విషయమై ఈనెల 15లోగా పూర్తి సమాచారంతో తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఆర్టీసీ సంస్థ, రవాణా శాఖకు కూడా బకాయిలు పడింది. పన్ను బకాయిలు చెల్లించాలని ఆ శాఖ ఆర్టీసీకి ఇప్పటికే నోటీసులు పంపిందన్న విషయం తెలిసిందే…