iDreamPost
android-app
ios-app

సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్ ప్రభుత్వం- విదేశీ విద్యార్థులకు భారీ షాక్

సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్ ప్రభుత్వం- విదేశీ విద్యార్థులకు భారీ షాక్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక వివాదాస్పద,అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంతో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు భవితవ్యం ప్రమాదంలో పడనుంది..

కరోనా కారణంగా ఇప్పటికే హెచ్‌-1బీ వంటి పలు వీసాలు, గ్రీన్‌కార్డుల జారీపై నిషేధం విధించిన అమెరికా ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించే విద్యాసంస్థలకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైనట్లయితే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా విద్యార్థి వీసాలు కూడా జారీ చేసే ప్రసక్తి లేదని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) స్పష్టం చేసింది.

ఈ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా ఎఫ్‌-1, ఎం-1పై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నవారు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి విద్యార్థులకు ఏర్పడింది. ఒకవేళ అమెరికాలో ఉండి చదువుకోవాలి అనుకుంటే ఆఫ్ లైన్ తరగతులు నిర్వహించే విద్యాసంస్థలకు బదిలీ చేసుకోవాలని ఐసీఈ వెల్లడించింది. ట్రంప్‌ ప్రభుత్వ తాజా నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్‌ మూర్ఖపు నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని డెమొక్రాటిక్‌ పార్టీ విమర్శించింది. ట్రంప్‌ తాజా నిర్ణయంతో అక్కడి విద్యాసంస్థలన్నీ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.  ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లేవారిలో అత్యధికులు చైనా, భారత్‌, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడాకు చెందినవారే అత్యధికంగా ఉన్నారు.