iDreamPost
android-app
ios-app

రాజకీయ భోగి మంటలు!

రాజకీయ భోగి మంటలు!

ఓకే రోజు రెండు సంఘటనలు.. ఒకటి….బోగీ పండుగు..,..హైదరాబాద్ పాతబస్తీ… చార్మినార్ వద్దకు వెళ్లి బోగి మంటలు వేసి, అనుచరులతో కలిసి టీతాగి వ్చచిన ఉదయాన్నే ఎమ్మెల్సీ కవిత….!

రేండు…జనగామ మునిసిపల్ కార్యాలయం ముందు ధ‌ర్నాకు దిగిన బీజేపీ కార్యకర్తలపై సీఐ మల్లేశ్ లాఠీఛార్జ్… బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జనగామ పర్యటన…!

ఏంటీ ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నార కదా? అయితే తప్పులో కాలేసినట్లే..ఏంటి ఆశ్చర్యంగా ఉందా? కాని దీనివెనుక టీఆర్ ఎస్ భవిష్యత్తు రాజకీయ వ్యూహం ఉంది. ఎలాగంటారా? ఇటీల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయఢాంకా మోగించింది బీజేపీ.. అయితే అంతకు ముందు ప్రమాణం పేరుతో ..ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్.. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు రావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరారు.. ర్యాలీగా వెళ్లారు.. కేసీఆర్ ఎలాగూ రారు..అందుకే భాగ్యలక్ష్మికి పూజలు చేసి వచ్చారు. ఆతర్వాత ఎన్నికల ప్రచారం ముగిసే ముందు బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా..హైదరాబాద్ కు వచ్చి అదే బాగ్యలక్ష్మికి పూజలు నిర్వహించారు.. అంటే పరోక్షంగా బీజేపీ హిందుదేవుళ్లను తమ వోన్ చేసుకుంది.. ఇతర పార్టీలు హిందువుల గురించి ఆలోచించడం లేదని చెప్పకనే చెప్పింది. అది అంత విశేషం కాదు కానీ, ఎంఐఎంతో అంటకాగుతున్న టీఆర్ఎస్ కు హిందువుల పట్ల, హిందూ దేవతల పట్ల శ్రధ్ద లేదని పరోక్ష సందేషం పంపించింది. బీజేపీ వస్తే పాత బస్తీ హిందువులకు మంచి రోజులు వస్తాయన్న సందేహం పంపింది, మరి భాగ్యలక్ష్మీ దేవి మహిమో.. లేక మరో కారణమో కాని జీహెచ్ ఎంసీలో బీజేపీ విజయ డాంకా మోగించింది.

అప్పట్లో బీజేపీని ఎదుర్కోవడానికి, ఎంఐఎం, టీఆర్ఎస్ అంటకాగుతున్నాయన్న ప్రచారాన్ని తిప్పు కొట్టడానికి.. కారు, పతంగీ శత్రువుల పాత్ర పోషించానా ప్రయోజనం దక్కలేదు.. హిందూ ఓటర్లు టీఆర్ఎస్ ను నమ్మలేదు.. దీంతో కిం కర్తవ్యం అని ఆలోచించిన టీఆర్ఎస్ కు భోగీ పండుగు బందరు లడ్డాలు తోచింది. ఇంకేముంది.. తెలంగాణ ఉద్యమమప్పుడు దసరా తెలంగాణ పండుగ, సంక్రాంతి ఆంధ్రపండుగ అని డంకా భజాయించి చెప్పిన కేసీఆర్ ముద్దుల కూతురు.. భోగి పండుగ రోజు అంటే ఈరోజు ఉదయాన్నే మందీ మార్బలంతో చార్మీనార్ వద్దకు వెళ్లింది బోగి మంటలు కాచుకుంది.. టీ తాగింది.. వచ్చింది.. అంటే టీఆర్ ఎస్ హిందుత్వానికి కట్టుబడి ఉంది,.. ఎంఐఎంతో పొత్తు రాజకీయమే తప్పు. ముస్లిం మతంతో కుమ్ము కావడం కాదన్న సంకేతాలను కవితక్క.. పరోక్షంగా ఇచ్చిందన్నమాట. అంతేకాదు మరో వైపు ఈరోజు బండి సంజయ్ బనగాన పర్యటనకు వెళుతున్నారు.. అక్కడకు వెళితే ఈ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఏ బాంబు పేల్చి వస్తారో..ముందే హిందుత్వ ఎజెండాను భుజాన వేసుకొని ..గతంలో కేసీఆర్ అన్న హిందుగాళ్లు బోందుగాళ్లు అన్న డైలాగ్ ను జనానికి గుర్తు చేస్తే.. ? అదో తంటా.. అందుకే గతాన్ని సమాధి చేసి..వర్తమానాన్ని కాస్త పండుగ రంగు పులిమి.. భాగ్యలక్ష్మి దేవత మీకే కాదు మాకూ దేవతే అని చెప్పడం ద్వారా భవిష్యత్తు రాజకీయానికి బాటలు వేసుకునేందుకే ఎమ్మెల్సీ కవిత ఉదయాన్నే రాజీకీయ బోగి మంటులు వేసి వచ్చిందన్నమాట.