iDreamPost
android-app
ios-app

బుల్లితెర బ్లాక్ బస్టర్లు ఇవే

  • Published Jul 23, 2021 | 7:35 AM Updated Updated Jul 23, 2021 | 7:35 AM
బుల్లితెర బ్లాక్ బస్టర్లు ఇవే

ఓటిటిలు ఎక్కువయ్యాక వీటి ప్రభావం శాటిలైట్ ఛానల్స్ ప్రేక్షకుల మీద ఇప్పటికైతే మరీ తీవ్రంగా పడలేదు. సాంప్రదాయక కేబుల్ వ్యవస్థలోనే ఇప్పటికీ కోట్లాది ఆడియన్స్ ఉండటంతో ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు. భవిష్యత్తులో స్మార్ట్ విప్లవం ఊపందకుని వైఫై టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడే రోజులు వచ్చినప్పుడు ఏమైనా మార్పులు జరగొచ్చేమో కానీ ప్రస్తుతానికి ఛానల్స్ సేఫ్ జోన్ లోనే ఉన్నాయి. సీరియల్స్, రియాలిటీ షోలకు ఎంత ఆదరణ ఉన్నా సినిమాలకుండే క్రేజ్ వేరు. ముఖ్యంగా కొత్త చిత్రాలు వరల్డ్ ప్రీమియర్ తో మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు వచ్చే రేటింగ్స్ రెవిన్యూలో చాలా కీలకంగా ఉంటాయి.

ఈ ఏడాది 2021 ఇప్పటిదాకా వచ్చిన టాప్ గా నిలిచినవేవో చూద్దాం. స్టార్ మాలో వచ్చిన ఉప్పెన బుల్లితెరపై కూడా నెంబర్ వన్ గా నిలిచింది. 18.5 రేటింగ్ తో అదరగొట్టింది. రెండో స్థానంలో క్రాక్ అదే ఛానల్ లో 11.7 సాధించగా మూడోది జాంబీ రెడ్డి 9.7తో దీన్ని కూడా స్టార్ మానే తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాతి స్థానాల్లో ఆర్య నటించిన డబ్బింగ్ మూవీ టెడ్డి(8.5)ఉండగా ఇటీవలే వచ్చిన నితిన్ చెక్ దీన్ని దాటేసి 8.6 రేటింగ్ తో జెమినికి వ్యూస్ తీసుకొచ్చింది. నెక్స్ట్ నాంది, రంగ్ దే, అల్లుడు అదుర్స్, ఆకాశం నీ హద్దురా, మాస్టర్, సోలో బ్రతుకే సో బెటరూ, అమ్మోరు తల్లి, డిస్కో రాజా, మిడిల్ క్లాస్ మెలోడీస్ తదితరాలు ఉన్నాయి.

ఆశ్చర్యకరంగా బాక్సాఫిస్ వద్ద పర్వాలేదు అనిపించిన రెడ్ లాంటి సినిమాలు పైన చెప్పిన వాటికంటే తక్కువగా 5 రేటింగ్ తో సరిపుచ్చుకోవడం గమనార్హం. అల్లరి నరేష్ బంగారు బుల్లోడు లాంటి వాటికి చాలా వీక్ రెస్పాన్స్ వచ్చింది. ఓటిటి తర్వాత డైరెక్ట్ గా ఛానల్ లో ప్రీమియర్ అయిన కొన్ని మూవీస్ కి సైతం స్పందన డివైడ్ గా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ట్రెండ్ ని గమనిస్తే రాబోయే రోజుల్లో కనక ఓటిటి ఇంకా విస్తరిస్తే ఈ వ్యూయర్ షిప్ లో భారీ మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. గత సంవత్సరం కంటే రేటింగ్స్ లో కొంత తగ్గుదల ఉన్న మాటైతే వాస్తవం

Also Read: నిజం కానున్న దగ్గుబాటి కాంబో ?