Idream media
Idream media
మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను నిలిపివేయాలంటూ రాజధాని అమరావతి పరిరక్షణ కమిటీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. బీసీజీ కమిటీ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ వాదనలు వినిపించారు. బీసీజీ పై ప్రభుత్వం నుంచి వివరాలు అందిన తర్వాత కోర్టుకు తెలుపుతామన్నారు.
కాగా ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇరు పక్షాలు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 21 లోపు దాఖలు చేయాలని సూచించిన ప్రధాన న్యాయమూర్తి జె.కె. మహేశ్వరి తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేశారు.