iDreamPost
android-app
ios-app

TNR comment on “ అరణ్య”

TNR comment on “ అరణ్య”

LOVE YOU RANA 😍
ఈ సినిమాలో రాణా పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉంది..
ఇప్పటి వరకు రాణా చేసిన సినిమాలలో అనుమానం లేకుండా ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్..
చాలా సెటిల్డ్ గా చేశాడు..
ఎక్కడా కూడా,యే ఫ్రేం లో కూడా క్యారెక్టర్ నుండి బయటకు రాలేదు..
ఈ సినిమాలో రాణా చేసింది చాలా స్ట్రెయిన్ తో కూడుకున్న పర్ఫార్మెన్స్…
ఈ పర్ఫార్మెన్స్ లో శారీరక శ్రమ,మానసిక శ్రమ చాలా ఉంది..
అలాంటి శారీరక,మానసిక శ్రమతో కూడుకుని ఉన్న పర్ఫార్మెన్స్ లో క్యారెక్టర్ కంటిన్యుటీ మెయింటెయిన్ చెయ్యడమన్నది చాలా గొప్ప విషయం..
ఇలాంటి హెవీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు యాక్టర్ ఎక్కడో అక్కడ రిలాక్స్ అయిపోయి,క్యారెక్టర్ లో మూడ్ కంటిన్యుటీ మెయింటెయిన్ చెయ్యలేక దొరికిపోయే అవకాశం ఉంటుంది..
కానీ అలా యే సింగిల్ ఫ్రేం లో కూడా రాణా ఆ జర్క్ ఆడియన్స్ కి తెప్పించకుండా తన క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా ప్లే చేశాడు..
ఈ సినిమా చూసిన ఎవరైకైనా బాహుబలి కంటే కూడా రాణా ఈ సినిమాకే ఫిజికల్ గా ఎక్కువ కష్టపడ్డాడని అనిపిస్తుంది..
ఒక క్యారెక్టర్ కి ఈ నటుడు తప్ప ఇంకెవరూ సూట్ అవలేరు అని అతి కొద్దిసార్లు అనిపిస్తుంది..
అలా ఈ సినిమాకి రాణా విషయంలో అనిపిస్తుంది..
యాక్టర్ కి క్యారెక్టర్ గురించి డైరెక్టర్ ఎంతో ఇంజెక్ట్ చేస్తే తప్ప ఇలాంటి పర్ఫార్మెన్స్ సాధ్యం కాదు..

గుర్తున్న కొన్ని ప్లస్ పాయింట్స్
————————
సినిమా కలర్ బాగుంది…
అడవి గురించి రాణా ఎమోషనల్ గా చెప్పే డైలాగ్స్ బాగుంటాయ్
సినిమాలో రాణా ట్రాఫిక్ లో చేసిన ఫైట్ చాలా బాగా కంపోజ్ చేశారు..
ఇలా సినిమాలో ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా అత్యధికంగా మార్కులు పడేది మాత్రం రాణా పర్ఫార్మెన్స్ కే..

గుర్తున్న కొన్ని మైనస్ పాయింట్స్
————————–
సినిమాలో అవసరం లేని ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయ్…
నక్సలైట్ తో సెకండ్ హీరో లవ్ స్టోరీ & నక్సలైట్ ఎపిసోడ్ అనవసరం..
ఎడిటింగ్ లో చాలా సీన్స్ లేపెయ్యడం వలన అవి అనవసరపు ఎపిసోడ్స్ గా మిగిలిపోయాయేమో అని అనిపించింది.
పాటలు ఎంగేజింగ్ గా లేవు.
సినిమాలో అక్కడక్కడా లాజిక్ లు మిస్ అయ్యాయ్..
ఉదాహరణకి హీరో ని ఎంతో ప్రేమిస్తూ అడవిలో జరుగుతున్న కార్యకలాపాలని ఎప్పటికప్పుడు తనకి చేరవేసే పక్షిని ఆఫీసర్స్ వచ్చి షూట్ చేస్తే దానికి హీరో నుండి ఎటువంటి రియాక్షన్ ఉండదు.
బహుశా ఎడిటింగ్ లో పోయిందేమో తెలీదు…
ఇలాంటి చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయ్…

ఫైనల్ లైన్స్
—————
చాలా బాధ్యతతో తీసిన సినిమా….
పిల్లలకు తప్పకుండా చూపించాల్సిన సినిమా…
సొసైటీకి చాలా అవసరమైన సినిమా..
సినిమా కథలో కొన్ని లోపాలు ఉన్నా కూడా,మైనస్ పాయింట్స్ ని పక్కనపెట్టేసి ఖచ్చితంగా ఆదరించి మన బాధ్యతని చూపించాల్సిన సినిమా..
సినిమా టాక్ తో సంబంధం లేకుండా,ఫలితంతో సంబంధం లేకుండా తప్పకుండా చూడండి..
ఈ సినిమాకి కూడా రేటింగ్స్ ఏంటి…?
వాళ్ళు పడిన శ్రమని గుర్తిద్దాం..
ఇలాంటి శ్రమని గుర్తించకపోతే సామాజిక స్పృహతో తీసే సినిమాలు ఆగిపోయే ప్రమాదం ఉంది..

LOVE YOU RANA..FOR YOUR SINCERE EFFORT 😍 – TNR