‘రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం’…శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో చిరంజీవి చెప్పిన ఓ డైలాగ్… మరి ఓ వ్యక్తి(వైఎస్ జగన్) లేదా ఓ పార్టీ(వైఎస్సార్సీపీ) అధికారంలో ఉంటే సహించలేని పత్రికలను ఏమనాలి….? ఏమో సినీ రచయితలే వీటికీ ఓ మంచి ‘చెడ్డ’ పేరు పెట్టాలి…! ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది మొదలు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు.. రాష్రంలో భయానక వాతావరణం నెలకొందని…ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందంటూ నకిలీ వార్తలు వండివారుస్తున్నాయి. తద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
పత్రికలకూ శత్రువులు…!
ఆటలు…ఎన్నికలు…ఇలా ఏవి తీసుకున్నా ప్రత్యర్థులే ఉంటారు. కానీ, విచిత్రంగా తెలుగు రాష్రాల్లోని ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను తమ ఏకైక ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తున్నాయి. దీంతో అసలు ప్రత్యర్థి అనే పదమే లేని జర్నలిజం డిక్షనరీలోకి ఏకంగా శత్రువు అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టిన అపకీర్తిని ఈ రెండు పత్రికలు మూటగట్టుకుంటున్నాయి.
అప్పుడిలా…..
అది 2015, జులై 14.. మంగళవారం…ఏ వైరస్ భారిన పడకుండానే 27 మంది అమాయకులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయారు… పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఇది ఓ వ్యక్తి.. కాదు కాదు… ముఖ్యమంత్రి అనే వ్యవస్థ రాజమండ్రి పుష్కరాల్లో ప్రచార ఆర్భాటానికి అర్రులు చాచటంతో జరిగిన మానవ ప్రమేయ విపత్తు…! దానిపై ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ప్రచార యావపై తీవ్ర విమర్శలు చేశాయి. కానీ, చంద్రబాబును ఆప్తమిత్రుడిగా భావించే ఆంధ్రజ్యోతి మరుసటి రోజు…గోదావరి కన్నీరు అనే శీర్షికతో ఆ కథనాన్ని ప్రచురించింది. 27 మంది మృతి అనే వార్తను చిన్న చిన్న అక్షరాలతో అచ్చేసింది. అక్రమంగా ఇసుక తవ్వకాలు వల్ల నదులు తల్లడితున్నాయి అనే సందర్భంలో పెట్టే హెడ్డింగును…ఓ వ్యక్తి వల్ల మృత్యు గోష జరిగితే అక్కడ వాడతారా…? ఇది సెలక్టివ్ జర్నలిజం కాదూ..? అప్పట్లో ఈనాడు సైతం భక్తులదే తప్పు అనే తరహాలో విశ్లేషణలు గావించింది. ఇక రెండో రోజుకొస్తే మొదటి పేజీలో జోరుగా భక్తులు అంటూ చంద్రబాబుకు పనికొచ్చేలా వార్తలు ప్రచురించి…దుర్ఘటన వార్తలను లోపలి పేజీల్లో చిన్నగా ప్రచురించాయి ఈ పత్రికలు.
మరిప్పుడు….
ఈరోజు ఈనాడు పత్రిక ఏపీ ఎడిషన్ మొదటి పేజీని పరిశీలిస్తే.. ‘మరో ముగ్గురు బలి’ అనే శీర్షిక తాటికాయలంత అక్షరాలతో కనిపిస్తుంది. అదే విధంగా రెడ్ జోన్లో 97 మండలాలు, ప్రభుత్వం తీరు బాధేస్తోంది అనే చంద్రబాబు వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి అయితే..రాజకీయ రోగం, అచ్చోసిన అలసత్వం అంటూ రకెలేసింది. మరి ఆనాటి బాబుగారి నిర్లక్ష్యాన్ని…ప్రచార యావను చూడలేని ప్రశ్నించలేని ఈ రెండు పత్రికలకు నేడు ఇంతలా నోరెందుకు లేస్తోంది…! ఎందుకంటే…ఆ రెండు పత్రికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉమ్మడి శత్రువుగా చూస్తున్నాయి కాబట్టి…!
సంబరాలు ఆగవా…!
500 దాటేశాయ్…ఏపీలో అత్యధిక ప్రాంతం రెడ్ జోన్ లోకి..హాట్ స్పాట్ ఏపీ….ఇవి ఆ రెండు పత్రికల భయకంపిత శీర్షికల్లో కొన్ని…! భారత్ స్కోర్ టెస్టుల్లో 500, 600లో దాటిన తరహాలో కరోనా కేసుల సంఖ్యను ప్రచురించడం… నిజంగా ఆ రెండు పత్రికలకే చెల్లింది. వీటిని చూస్తుంటే ఈ పత్రికలు విపత్తు వార్తలు ఇస్తున్నాయా… ఏకేమైనా సంబరాలు చేసుకుంటున్నాయా అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.
నిజంగా యోధుడే…
అతనో యోగి…అతనో యోధుడు…సైరా నరసింహారెడ్డి సినిమాలోని ఓ డైలాగ్…ఇది ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సరిగ్గా సరితూగుతుందని
చెప్పొచ్చు. ఓ వైపు ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్న శవరాజకీయాలను…మరోవైపు పసుపు పత్రికలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నవ్వుతూనే తట్టుకుంటూ కరోనాపై యుద్ధం చేస్తున్నాడు…కాబట్టి వైఎస్ జగన్ నిజంగానే ఓ యోగి…ఓ యోధుడు….!