ఏదైనా ఒక మంచి తమిళ్ లేదా మలయాళం సినిమా చూసినప్పుడు ఆ ఆనందాన్ని అలాగే ఆపుకోకుండా కొందరు సోషల్ మీడియా వేదికగా మన వాళ్ళకి అంత దమ్ము లేదు రా, వాళ్ళు చూడండి ఎలాంటి ఎలాంటి సినిమాలు చేస్తున్నారో? అంటూ కామెంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిజానికి తెలుగు సినిమా మేకర్స్ కు దమ్ము లేదు అనే ముందు తెలుగు సినీ ప్రేక్షకుడి మెచ్యూరిటీ ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సినీ ప్రేక్షకులు ప్రయోగాత్మక సినిమాలు ఆదరించడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఆదరించాలి అన్నా ఆ సినిమా పూర్తిగా కొత్త వాళ్ళు తీసిన సినిమా అయ్యుండాలి ఒకవేళ స్టార్లు ఎవరైనా ఆ సినిమాలో భాగమయ్యారు అని తెలిస్తే ఎందుకో ఆ సినిమా మీద ఆసక్తి చూపించరు.
ఒకప్పుడు ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయడానికి సిద్ధమైన మహేష్ బాబు అందులో భాగంగా రెండు మూడు సినిమాలు చేశారు కూడా.. కానీ తన తండ్రి చెప్పిన ఒక మాట ఇప్పటికీ నిజమే అవుతూ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు తాజా ఇంటర్వ్యూలో. నాని అనే సినిమా చేసిన తర్వాత ఆ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఒక మాట చెప్పారట ఈ సినిమా కనుక హిట్ అయితే మహేష్ బాబు స్టార్ కాదు అని ఈ సినిమా ఫ్లాప్ అయితే మహేష్ బాబు స్టార్ హీరో అయిపోయినట్టేనని చెప్పుకొచ్చారు. ఇదేమి లాజిక్ అని ప్రశ్నిస్తే స్టార్లు ప్రయోగాలు చేస్తే తెలుగు సినీ ప్రేక్షకులు ఆదరించరు అని తన లెక్కలు చెప్పుకు వచ్చారట కృష్ణ. అలాగే మహేష్ బాబు చేసిన నాని నిజం నేనొక్కడే నీ లాంటి సినిమాలు ప్రయోగాత్మక సినిమాలుగా నిలిచి ప్రేక్షకులకు దూరమయ్యాయి.
మన తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్లలో మహేష్ బాబు ఒకరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆయన సక్సెస్ రేటు కూడా బాగానే ఉంది. అయితే తన సినిమాల ఎంపిక విషయంలో చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే వాదన ముందు నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబును ప్రశ్నించగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. “నేను గతంలో కొన్ని ప్రయోగాలు చేశాను కానీ అవి ఫలించలేదు, దక్షిణాది స్టార్లు ప్రేక్షకుల బలమైన టేస్ట్ ను శాటిస్ఫై చేయాలి, మా మీద భారీ మొత్తంలో పెట్టుబడి పెడతారు కాబట్టి ప్రయోగాలకు ఆస్కారం లేదు. డిఫరెంట్‌గా చేసే ప్రయత్నం కంటే ముందుగా అభిమానులను, ప్రేక్షకులను శాటిస్ఫై చేయాలి’ అని మహేష్ బాబు అన్నారు. ఇక మహేష్ బాబు తదుపరి చిత్రం సర్కారు వారి పాట ఏప్రిల్ 1, 2022న విడుదలవుతుంది. ఆ తరువాత త్రివిక్రమ్‌తో #SSMB28తో పాటు, ఆపై రాజమౌళితో ఒక సినిమా చేస్తున్నారు మహేష్.
Also Read : EMK Jr NTR & Mahesh Babu : రాజమౌళి గురించి భయపెట్టిన తారక్