iDreamPost
android-app
ios-app

Allu Arjun : ఏ భాషలోనూ లాజిక్స్ ఉండవు కదా

  • Published Feb 05, 2022 | 3:57 PM Updated Updated Feb 05, 2022 | 3:57 PM
Allu Arjun : ఏ భాషలోనూ లాజిక్స్ ఉండవు కదా

నిన్న అల్లు అర్జున్ నటించిన కొత్త జొమాటో యాడ్ సోషల్ మీడియాలో మినీ తుఫాను రేపింది. అందులో సుబ్బరాజుని బన్నీ కొడుతూ ఎక్కువ సేపు గాల్లో నిలబెడతాడు. కిందకు దింపొచ్చు కదాని అడిగితే అదంతే సౌత్ సినిమాల్లో ఎక్కువసేపు ఉండాలని కౌంటర్ వేస్తాడు. ఇప్పుడిదే విమర్శలకు దారి తీస్తోంది. కేవలం తెలుగు తమిళ సినిమాల్లోనే ఇలాంటి అతిశయోక్తితో కూడిన ఫైట్లు ఉంటాయన్నది యాడ్ డైరెక్టర్ ఉద్దేశం కావొచ్చు. ఇదే తప్పంటున్నారు అభిమానులు. ఎందుకంటే హిందీ చిత్రాల్లో ఇంతకన్నా ఓవర్ బిల్డప్ లు చాలా సార్లు చూసిందే. ఎక్కడి దాకో ఎందుకు గత ఏడాదే విడుదలైన సల్మాన్ ఖాన్ రాధేలో ఎన్ని కళాఖండాలు ఉన్నాయో

సరే ఇది మన ప్రభుదేవానే కదా తీసింది అంటారేమో. మరి ఆ మధ్య వచ్చిన ధూమ్ 3లో అమీర్ ఖాన్ బైకు వేసుకుని పదుల అంతస్తుల బిల్డింగ్ పై నించి కిందికి రావడం గురించి ఎంత వర్ణించినా తక్కువే. అజయ్ దేవగన్ కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో మసాలా మూవీస్ చేశాడు. ఇక సునీల్ శెట్టి గురించి చెప్పేదేముంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. దశాబ్దాలుగా అన్ని భాషల్లోనూ ఈ హీరోయిజం చూస్తున్నదే. కొత్తగా సౌత్ అంటూ నొక్కి చెబుతూ ఎక్కువా సేపు గాల్లో వేలాడాలనే పంచ్ వేయడం సెల్ఫ్ గోల్ లాంటిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీని మీద ఇండస్ట్రీలో వ్యతిరేకత రాలేదు కానీ మూవీస్ లవర్స్ రాంగ్ అంటున్నారు

గతంలో ఇదే జొమాటో యాడ్ కోసం బన్నీ ఆర్టిసిని వ్యంగ్యంగా కామెంట్ చేయడం, ఎండి సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాన్ని తర్వాత కంపెనీ విత్ డ్రా చేసుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తారా అంటే ఆ సూచనలు పెద్దగా కనిపించడం లేదు. అయినా మన సినిమాల మీద మనమే సెటైర్లు వేసుకోవడం ఏమిటని మెజారిటీ నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. లాజిక్స్ ఎక్కువ లేకపోతేనే ఏ చిత్రమైనా పండుతుంది. అలాంటిది దేశంలో కేవలం ఒక వైపే ఇలాంటివి తీస్తారని ప్రోజెక్ట్ చేయడం సరికాదు. అప్పుడూ ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ అల్లు అర్జున్ స్పందించలేదు కానీ ఇకపై చెక్ చేసుకోవడం బెటరేమో

Also Read :   Ram Charan : మెగా పవర్ స్టార్ కోసం క్రేజీ కాంబినేషన్