iDreamPost
android-app
ios-app

క్రేజ్ లేని రోజుల్లో చేసిన సినిమాలతో

  • Published Apr 28, 2021 | 5:47 AM Updated Updated Apr 28, 2021 | 5:47 AM
క్రేజ్ లేని రోజుల్లో చేసిన సినిమాలతో

పరిశ్రమకు కొత్తగా వచ్చిన యూత్ హీరోలు కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ కథ నచ్చలేదనో ఇంకే కారణమో చెప్పి నో అంటే చేతిలో ఉన్నది కూడా పోవచ్చనే భయం ఉంటుంది. అయితే అలా చేసినవన్నీ విడుదలవుతాయనే గ్యారెంటీ లేదు. ఏవేవో కారణాల వల్ల ఏళ్ళ తరబడి ల్యాబుల్లో మగ్గిపోయేవి కూడా అందరు హీరోలవి కలిపి ఇప్పటికీ కొన్ని వందలు వేలల్లో ఉంటాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అవి చేసిన హీరోలకు క్రేజ్ వచ్చి మార్కెట్ పెరిగి బిజినెస్ జరుగుతున్న తరుణంలో అప్పుడు తమ ప్రింట్లను బయటికి తీసే నిర్మాతలు లేకపోలేదు. అలాంటిదే ఇప్పుడు కార్తికేయకు జరుగుతోంది.

నిజానికి ఆరెక్స్ 100 ఇతని మొదటి సినిమా అనుకుంటారు కానీ వాస్తవానికి ప్రేమతో మీ కార్తీక్ అని దానికన్నా ముందు థియేటర్లలో విడుదలై ఫ్లాప్ అయ్యింది. ప్రైమ్ లో అందుబాటులో ఉంది. దీని మీద ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. అయితే దీనికన్నా ముందు నటించిన ఫైనల్ సెటిల్మెంట్ అనే రౌడీయిజం బ్యాక్ డ్రాప్ మూవీ చేశాడు కార్తికేయ. కానీ అది ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. సరే ఇప్పుడు వదలితే ఎంతో కొంత సొమ్మొస్తుందనే ఉద్దేశంతో దాని నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేసి విడుదలకు రెడీ చేస్తున్నారు. ఇప్పటి లుక్ తో పోలిస్తే కార్తికేయ ఇందులో మరీ లేతగా ఉన్నాడు. దీన్ని బట్టి ఎంత పాతదో అర్థం చేసుకోవచ్చు

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ సక్సెస్ ల తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో నటించిన ఏ మంత్రం వేశావే అనే లోటు బడ్జెట్ సినిమాని హంగామా చేసి థియేటర్లలో వదిలారు. దాన్ని విజయే ప్రోమోట్ చేసేందుకు ఇష్టపడలేదు. ఊహించినట్టే అది డిజాస్టర్ అయ్యింది కానీ ఇది రాకుండా ఉండాల్సిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు. కార్తికేయ పరిస్థితి అలా కాదు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో బాగా డౌన్ లో ఉన్నాడు. ఇప్పుడీ ఫైనల్ సెటిల్మెంట్ అద్భుతాలు చేసే సీన్ లేదు కాబట్టి కౌంట్ లో మరో ఫ్లాప్ పడుతుందా లేక లక్కీగా హిట్ దక్కుతుందా వేచి చూద్దాం