iDreamPost
android-app
ios-app

న్యాచురల్ స్టార్ ని వెంటాడుతున్న కల్లోలం

  • Published Apr 22, 2021 | 9:30 AM Updated Updated Apr 22, 2021 | 9:30 AM
న్యాచురల్ స్టార్ ని వెంటాడుతున్న కల్లోలం

ఇప్పుడు ప్రపంచం మొత్తం వణికిపోతున్న కరోనా సెకండ్ వేవ్ ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. కేసులు పెరుగుతున్నాయి. డెత్ కౌంట్ తగ్గడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను వాయిదా వేయడం తప్ప నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. కాకపోతే ఎన్ని రోజులు అనే క్లారిటీ రావడం లేదు. ఒక నెలా లేక అంతకు మించా అనే ప్రశ్నకు ప్రభుత్వాల వద్ద కూడా సమాధానం లేదు. థియేటర్లు ఏదో మొక్కుబడిగా నడుస్తున్నాయి కానీ ఇప్పట్లో హౌస్ ఫుల్ బోర్డులు చూడటం కష్టమే. సినిమాలే లేనప్పుడు బుకింగ్స్ గురించి మాట్లాడి లాభం లేదు.

ఇక అసలు విషయానికి వస్తే గత ఏడాది సరిగ్గా లాక్ డౌన్ టైంలో విడుదల ప్లాన్ చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని వి అనుకోకుండా వాయిదాల మీద వాయిదాలు పడి ఫైనల్ గా ప్రైమ్ లో వచ్చేసింది. అప్పుడు అనుకున్న డేట్ మార్చి 25. కరోనా వల్ల ముందు ఎఫెక్ట్ అయిన మూవీ కూడా వినే. ఇప్పుడు మళ్ళీ అలాంటి సందర్భమే వచ్చింది. సరిగ్గా ఏప్రిల్ 23 ప్లాన్ చేసుకున్న టక్ జగదీశ్ కు బ్రేకులు వేస్తూ మళ్ళీ సెకండ్ వేవ్ కరోనా రిలీజ్ కు అడ్డంగా మారింది. కాకపోతే ఈసారి నెల మారింది. అప్పుడు వి మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఇప్పుడు టక్ జగదీశ్ మీద అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.

దీన్ని ఆధారంగా చేసుకుని టక్ జగదీశ్ కూడా వి తరహాలో డిజిటల్ రూట్ పడుతుందేమో అనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాలతో పాటు మీడియాలోనూ మొదలయ్యింది. కానీ నాని మాత్రం ఈ విషయం పట్ల చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆప్షన్ గురించి ఆలోచించవద్దని, ఎంత లేట్ అయినా వేచి చూద్దామని, కావాలంటే శ్యామ్ సింగ రాయ్ ని ఆలస్యంగా ప్లాన్ చేసేలా నిర్మాతలకు చెబుతానని అన్నారట. ఇదంతా ఏమో కానీ లాక్ డౌన్స్ వల్ల 2020లో, 2021లో ముందు ఎఫెక్ట్ అయినవి నాని సినిమాలే కావడం గమనార్హం. ఒకవేళ పరిస్థితి సద్దుమణిగితే టక్ జగదీశ్ మేలో థియేట్రికల్ రిలీజ్ ఉండొచ్చు