iDreamPost
android-app
ios-app

సినిమాలకు మార్గం సుగమం

  • Published Jun 15, 2021 | 7:01 AM Updated Updated Jun 15, 2021 | 7:01 AM
సినిమాలకు మార్గం సుగమం

సుమారు రెండు నెలలకు పైగా గ్యాప్ తర్వాత థియేటర్లు తెరుచుకునే దిశగా అడుగులు పడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తెలంగాణలో జూలై 1 నుంచి సినిమా హాళ్లకు అనుమతులు రావొచ్చని అంటున్నారు. తేదీ అటుఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి అనుకూల నిర్ణయమే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే లాక్ డౌన్ సమయంలో భారీ మినహాయింపులు వచ్చేశాయి. జనం ఎప్పటిలాగే తమ పనులు వృత్తులు చేసుకుంటున్నారు. ఈ నెల ఎలాగూ సగం పూర్తయ్యింది కాబట్టి హడావిడిగా థియేటర్లకు అనుమతులు ఇచ్చే బదులు కొంత వ్యవధి ఇస్తే యాజమాన్యాలు దానికి తగ్గట్టుగా సిద్ధమయ్యే వెసులుబాటు ఉంటుంది.

కానీ యాభై శాతం మించి ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. థర్డ్ వేవ్ వస్తుందన్న గ్యారెంటీ లేకపోయినా ప్రభుత్వాలు ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉన్నాయి. కీడెంచి మేలెంచమన్నారు కాబట్టి దానికి అనుగుణంగా ఫుల్ కెపాసిటీని ఆశించడం అత్యాశే అవుతుంది. సో జూలై ఆగస్ట్ రెండు నెలలు సగం సీట్లతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. అంతా కుదురుకుని కేసులు పూర్తిగా తగ్గిపోయి వ్యాక్సిన్లు అధిక శాతం జనానికి చేరిపోయి ఉంటే ఆపై మొదలవుతుంది అసలైన బాక్సాఫీస్ జాతర. ఎవరు ముందు వస్తారని చెప్పడం తొందరపాటు అవుతుంది కానీ కొంచెం వేచి చూడాలి మరి.

ఇప్పుడు తీసుకునే ఏ నిర్ణయాలైనా ఖచ్చితంగా అమలవుతాయని చెప్పలేం. థియేటర్లు తెరిచాక కేసులు కనిపిస్తే మళ్ళీ మొదటికే రావాల్సి వస్తుంది. అలా జరగకూడదనే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ లో షూటింగుల సందడి మెల్లగా మొదలైపోయింది. నితిన్, విశాల్ లు తమ సెట్లలోకి అడుగు పెట్టేశారు. టైం చూసుకుని తక్కువ బ్యాలన్స్ షూట్ పెండింగ్ ఉన్న యూనిట్లన్నీ రంగంలోకి దిగుతాయి. ఇక చిన్న మరియు మీడియం రేంజ్ ప్రొడ్యూసర్లు అత్యాశకు పోకుండా తమ సినిమాలు జూలై ఆగస్ట్ లో థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటే సగం సీట్లతోనూ వర్క్ అవుట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ కంటెంట్ బాగుంటేనే సుమా