iDreamPost
iDreamPost
తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరుచుకుంది మొదటి విశాఖపట్నంలో ఆ తర్వాత విజయవాడలో. మిగిలిన ప్రాంతాల గురించి ఇంకా ఎలాంటి ఊసు లేదు. అవి కూడా ఐనాక్స్, సినీ పోలీస్ లాంటి మల్టీ ప్లెక్సులు తప్ప సింగల్ స్క్రీన్ల గేట్లు ఇంకా తెరవలేదు. యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక్క జగదాంబ కాంప్లెక్స్ ని మాత్రమే ఓపెన్ చేశారు. అందులోనూ ఒక తెరమీదే ప్రస్తుతం సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఖైదీ, కనులు కనులను దోచాయంటే, సరి లేరు నీకెవ్వరు, భీష్మ, ఆల వైకుంఠపురములో లాంటి చిత్రాలతో ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నారు. దీపావళికి కొత్త మూవీస్ ఉంటాయని ఆశించిన ట్రేడ్ కి ఆశాభంగం తప్పలేదు. ఏ నిర్మాత సాహసం చేయలేదు.
సరే వీటికి కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే అడగకపోవడమే మంచిదనేలా ఉంది పరిస్థితి. తెలంగాణలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. రేపు ఎల్లుండి అంటున్నారే తప్ప స్పష్టమైన సమాచారం లేదు. ఆంధ్రప్రదేశ్ లో అనుమతులు ఇచ్చినా కూడా ఎగ్జిబిటర్లు ఇతర కారణాల వల్ల వెంటనే తెరిచేందుకు ఇష్టపడటం లేదు. ఏదైతేనేం మూవీ లవర్స్ ఎదురు చూపులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబర్ లో పూర్తి స్థాయి అనుమతులు వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం అనే ధోరణిలో డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు ఉన్నారు. కనీసం క్రిస్మస్ కు కూడా ఏ సినిమా విడుదల ప్రకటన ఇప్పటిదాకా రాలేదు.
మరోవైపు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మల్టీ ప్లెక్సులు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. కనివిని ఎరుగని రీతిలో కేవలం 59 రూపాయలతో మొదలుపెట్టి టికెట్ల అమ్మకాలు జరుపుతున్నారు. కొందరు వన్ ప్లస్ వన్ అంటున్న వాళ్ళు లేకపోలేదు. బెంగుళూరు లాంటి మహా నగరాల్లో సైతం 99 రూపాయలకు టికెట్లు ఇవ్వడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే సంక్రాంతికి అంత సద్దుమణుగుతుందని ఆశపడుతున్న తరుణంలో సెకండ్ వేవ్ కరోనా గురించి జరుగుతున్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాలను ఖంగారు పెడుతోంది. మరోవైపు దీపావళిని టార్గెట్ చేసుకుని ఓటిటిలో వరసగా కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి