వికారాబాద్ జిల్లా సుల్తాన్ పూర్ లో మొరం తవ్వుతుండగా బంగారు గాజులు నగలతో పాటుగా వెండి చెంబులు బయటపడ్డాయి..
వివరాల్లోకి వెళితే సిద్దిఖ్ అనే వ్యక్తి తండ్రితో కలిసి పొలంలో మొరం తవ్వుతుండగా నాలుగు వెండి చెంబులతో పాటుగా బంగారు గొలుసులు, గాజులు బయటపడ్డాయి. సంబంధిత విషయం తెలియడంతో తహశీల్దార్ తో పాటుగా పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు.
గుప్తనిధులు ఎలా దొరికాయి అనే కోణంలో విచారణ చేపట్టారు. గుప్తనిధుల కోసం అన్వేషిస్తే అవి దొరికాయా లేక పొలం పనులు చేపట్టగా అవి దొరికాయా అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. కాగా బయట పడిన బంగారు,వెండి ఆభరణాలకు పంచనామా నిర్వహించిన అనంతరం అవి ఏ కాలానికి చెందినవి, వాటి విలువ ఎంత ఉంటుందనేది పురావస్తు శాఖ అధికారులు వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. బయటపడిన బంగారం విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం.. బంగారం దొరికిన నేపథ్యంలో అక్కడ మరిన్ని తవ్వకాలు జరుపుతారో లేదో వేచి చూడాలి.