iDreamPost
iDreamPost
దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా వాటిని ఏపీకి ముడిపెట్టే కొత్త సంప్రదాయం మొదలయ్యింది. అందులో పచ్చ మీడియాకి గిట్టని పాలన సాగుతుండడంతో అంతా డ్రగ్స్ హబ్ గా చిత్రీకరించే యత్నం సాగుతోంది. ఏపీ పరువు తీస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసినా రాష్ట్ర భవిష్యత్తునే దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. తాము అధికారంలో లేకపోతే ఎంతకైనా తెగిస్తామని ఓ సెక్షన్ చాటుకుంటోంది.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నట్టు ఓ సమాచారం అందింది. లెహంగాల మాటున ఖరీదైన డ్రగ్స్ రవాణా చేస్తూ బెంగళూరులో ఓ ముఠా పట్టుబడింది. అయితే అవి నరసాపురం నుంచి తీసుకెళుతున్నట్టు నిందితుల నుంచి వచ్చిన ప్రాాథమిక సమాచారం. సహజంగా దొంగతనం చేసేవాడు అనేక అబద్ధాలు చెబుతాడు. పట్టుబడినా విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తాడు. ఇది అందరూ అంగీకరించే వాస్తవం. ఈ కేసులో కూడా దోషులు అదే పని చేశారు. కానీ వాళ్లిచ్చిన ప్రాాథమిక సమాచారం ఆధారంగా ఏపీలో ఏదో జరిగిపోతోందని చిత్రీకరించేందుకు పచ్చ మీడియా ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉంది. మాఫియా ముఠాల మాటనే జనంలో చెల్లుబాటు చేసేందుకు సిద్ధపడడం ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇది నిజమైన నిందితులను, ముఠా ములాలను తెలుసుకోకుండా చేసే ప్రయత్నం అనేది అక్షర సత్యం.
బెంగళూరు పోలీసులకు వచ్చిన ఈ పక్కదారి పట్టించే సమాచారమే నిర్దారణ కాలేదు. అధికారిక ప్రకటన కూడా లేదు. అయినా గానీ విశ్వసనీయ సమాచారం అంటూ ఆంధ్రప్రదేశ్ లో పాఠకులకు అందించి ప్రజలందరినీ మభ్యపెట్టాలనే ప్రయత్నం విస్మయకరంగా ఉంది. వాస్తవంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతం లేసుల అల్లికకు ప్రసిద్ధి. అక్కడి మహిళలు లేసులు అల్లిక ద్వారా ఉపాధి పొందుతూ ఉంటారు. అలాంటి వారందరినీ అనుమానించేలా పచ్చ మీడియా చేసిన యత్నం ఏపీని అవమానించడమే .అనుమానం లేదు. అందులోనూ ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నాయనే వాదన అందరూ తప్పుబట్టాల్సిన అవసరం ఉంది. ఇలా ఏపీని అనుమానించేలా చేస్తున్న ఈ ప్రయత్నాలకు దిగుతున్న వారి పట్ల ప్రజలు, పాఠకులు కూడా అప్రమత్తం కావాల్సి ఉంది.
Also Read : Drugs Trafficking – చంద్రబాబు తాను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా, మళ్లీ యూటర్న్ తీసుకుంటారా