iDreamPost
iDreamPost
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వాలెట్ మరియు వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ యొక్క ప్రెస్ సెక్రటరీకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు ఇప్పటికే నిర్ధారంచబడ్డాక ఇప్పుడు తాజాగ డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ యొక్క వ్యక్తిగత సహాయకురాలికి కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇది వైట్ హౌస్ లో మూడవ కరోనా పాజిటివ్ కేస్ గా ధృవీకరించబడింది.
అందుతున్న సమాచారం ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె కోసం వ్యక్తిగత సామర్థ్యంతో పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ చాలా వారాల నుండి ఆమె వద్ద లేరు అని తెలుస్తుంది. దాదాపు రెండు నెలలుగా సదరు వ్యక్తి ట్రంప్ కుమార్తెకు దూరంగా ఉంటూ టెలివర్క్ పని చేస్తుందని, కావున ఇవాంకాకు ఎంటువంటి ఇబ్బంది ఉండదని, ఆమెకు ప్రస్తుతానికి కరోనా లక్షణాలు కూడా లేవని అధికార వర్గాలు చెబుతున్న మాట. అయితే ముందు జాగ్రత్తగా శుక్రవారం, ఇవాంకా మరియు ఆమె భర్త జారెడ్ కుష్నర్ ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వారికి నెగిటివ్ వచ్చినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.