Idream media
Idream media
ప్రతిపక్షాలు అంతలా ఆరోపణలు చేస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సమాధానం చెప్పడం లేదు… అని కొంత కాలంగా జరుగుతున్న చర్చకు కేసిఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ముందు నుంచీ ఊహించినట్టుగానే అసెంబ్లీ వేదిక గానే ఆయన ప్రతి పక్షాలకు సమాధానం చెబుతున్నారు. కరోనా మహమ్మారి కి భయపడి కేసిఆర్ పారిపోయారని, ప్రభుత్వం చేతులెత్తేసింద అని కొంత కాలంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఓ స్థాయిలో వారు విమర్శలు శ్రుతి మించాయని, కేసిఆర్ మీడియా వేదికగా సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ శ్రేణులు సైతం కేసిఆర్ కి సూచించారు. చాలా మంది ఆయన మీడియా వేదికగా మాట్లాడతారని ఎదురు చూశారు కూడా. కానీ కేసిఆర్ మాత్రం నిశబ్దంగా ప్రభుత్వ కార్యక్రమాల పనుల్లో బిజీగా గడిపారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అని తెలిసినప్పటి నుంచే ఆయన ఆ వేదిక గానే బదులు చెబుతారని భావించారు. అనుకున్నట్లుగానే ఆయన ప్రతిపక్షాలు చేసిన ఒక్కో ఆరోపణలకు ఘాటుగా సమాధానం చెబుతున్నారు.
ఎందుకు మాట్లాడ లేదో చెప్పారు..
తెలంగాణలో ఉన్న ప్రతిపక్షం ఓ ప్రతిపక్ష మేనా.. అంటూ కేసిఆర్ శాసనసభ లో బుధవారం జరిగిన చర్చలో ప్రశ్నించారు. అందుకే వారి ఆరోపణలకు సమాధానం చెప్పినా వృథా అని స్పందించడం లేదని తెలిపారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్స్, ఆక్సిజన్ పడకలు లేవని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి కేసిఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
మీరన్నది నిజమే అని చెబుతూ.. ఈ దారిద్ర్యం మీ నుంచి వారసత్వంగా వచ్చినదే అని, మాకన్నా ముందు మీరే 50 ఏళ్లు పాలించేరు కదా అన్నారు. ఆ దరిద్రాన్ని మేం పారద్రోలి ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్నీ ఏర్పాట్లూ చేపడుతున్నామన్నారు. ” మీరే ఆస్పత్రులు తిరుగుతున్నా రా..? మీకే సమస్యలు తెలుసా..? మా మంత్రులు తిరగడం లేదా.., ఎమ్మెల్యే లు తిరగడం లేదా.., మా ఆరోగ్య మంత్రి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారని, నేరుగా కరోనా రోగులు ఉన్న వార్డుల్లో కే వెళ్లి మరీ పరిశీలించారు అని.. ఏ ఆస్పత్రిలో ఏ లోటు ఉన్నా తక్షణం తీర్చే వారని తెలిపారు. ఇలా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు కేసిఆర్ సమాధానం చెప్పారు.