iDreamPost
android-app
ios-app

అదే రామ్ గోపాల్‌ వర్మ ప్రత్యేకత.!

అదే రామ్ గోపాల్‌ వర్మ ప్రత్యేకత.!

సంచలనాలకు కేంద్ర బిందువు రామ్ గోపాల్‌ వర్మ. వరుసగా ఆయన తీస్తోన్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టేసినా, ఆయనకున్న స్టార్‌డమ్ మాత్రం తగ్గడంలేదు. అదే ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవాలేమో. ఏదన్నా సినిమా రూపొందించాలనుకుంటే, అది ఎంత సంచలనమవుతుంది.? అని ముందుగానే ఓ నిర్ణయానికొస్తాడాయన. అంతేనా, దాన్ని మరింత సంచలనంగా ఎలా మార్చాలో కూడా ఓ లెక్కేసుకుని మరీ రంగంలోకి దిగుతాడు రామ్ గోపాల్‌ వర్మ. ఈ క్రమంలో ఆయన వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నాడు.. కమర్షియల్‌గానే.! ఆ కమర్షియల్‌ సక్సెస్‌ అనేది చాలామందికి అర్థం కాకపోవచ్చుగాక.. అది వేరే సంగతి. ఇక, ఇప్పుడు రామ్ గోపాల్‌ వర్మ జీవితం చాలామందికి కథాంశంగా మారిపోతోంది. వర్మని విమర్శించడానికో.. వర్మని పొగిడేందుకో.. కారణమేదైతేనేం, ఓ అరడజను సినిమాలు ఇప్పుడు నిర్మాణంలో వున్నాయి ఆయన్ని కథాంశంగా చేసుకుని రూపొందిస్తున్నవి. మొన్నామధ్య ‘పరాన్నజీవి’ అనే సినిమా వచ్చింది ఇలాగే. ఇక, ఇలా కాదనుకున్నాడో ఏమో.. తన మీద తానే సినిమాలు తీసుకోవడానికి సిద్ధమైన వర్మ, ఏకంగా మూడు పార్టులుగా తన జీవితాన్ని తెరకెక్కిస్తోన్న విషయం విదితమే. అదే వర్మ ప్రత్యేకత. అరడజను కాదు, డజనుకు పైగానే సినిమాలు వర్మ మీద రాబోతున్నాయని తెలుస్తోంది. వీటిల్లో ఏదీ వెండితెరపై ప్రదర్శించే అవకాశం లేదట. అన్నీ ఓటీటీని నమ్ముకునే రూపొందుతున్నాయని సమాచారం. ఓ దర్శకుడి మీద ఇన్ని సినిమాలు రూపొందుతుండడమా.? ఇదీ ఓ రికార్డే మరి.! దటీజ్‌ రావ్‌ు గోపాల్‌ వర్మ.