iDreamPost
iDreamPost
సరిలేరు నీకెవ్వరు తర్వాత లాక్ డౌన్ వల్ల తన కొత్త సినిమా సర్కారు వారి పాటని ఇప్పటికీ ప్రారంభించలేకపోతున్న మహేష్ బాబు త్వరలోనే షూటింగ్ సెట్లో అడుగు పెట్టబోతున్నారు. మరికొద్ది రోజుల్లో దుబాయ్ లో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముందు అమెరికాలో అనుకున్నా కరోనా ఉధృతి అక్కడ మళ్ళీ తీవ్ర రూపం దాల్చడంతో నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. కథ యుఎస్ లొకేషన్లను డిమాండ్ చేస్తున్నప్పటికీ దీన్ని ఇప్పుడు చివరి ఆప్షన్ గా పెట్టబోతున్నారు. అవసరమైతే హైదరాబాద్ లోనే సెట్లు వేసి పూర్తి చేసినా ఆశ్చర్య లేదు.
ఇదిలా ఉండగా దీని తర్వాత రాజమౌళి సినిమా ఉండొచ్చని అభిమానులు ఇప్పటికే చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్టు కన్ఫర్మ్ అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకుని జక్కన్న ఖచ్చితంగా ఎప్పుడు ఫ్రీ అవుతాడనే క్లారిటీ ఇంకా రావడం లేదు. అందులోనూ ఒక్కసారి తనకు ఏ హీరో అయినా కమిట్ అయితే కనీసం రెండు మూడేళ్లు త్యాగం చేయాల్సిందేనని చాలా సార్లు ఋజువయ్యింది. అందుకే ఆలోగా సర్కారు వారి పాటతో పాటు చెరో ఆరు నెలల్లో పూర్తయ్యే మరో రెండు సినిమాలు చేయాలని మహేష్ డిసైడ్ అయినట్టుగా టాక్. అందుకే ఇప్పుడు మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది.
ఛలో, భీష్మ రూపంలో తన బ్రాండ్ ఎంటర్ టైన్మెంట్ తో రెండు సూపర్ హిట్లు కొట్టిన వెంకీ కుడుములతో చేసే అవకాశాలు ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దీనికి అనుసంధానకర్తగా వ్యవహరించింది మహేష్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కొరటాల శివనట. తన రికమండేషన్ వల్లే వెంకీ కుడుముల కథ వినేందుకు ప్రిన్స్ ఒప్పుకున్నట్టు సమాచారం. ఇది నిజమైతే మరోసారి మహేష్ ని మంచి వినోదాత్మక చిత్రంలో చూడొచ్చు. కాకపోతే ఇదింకా ప్రపోజల్ స్టేజి లోనే ఉందట. సర్కారు వారి పాట మొదలయ్యాక ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. క్లారిటీ రావడానికి టైం అయితే పడుతుంది. అప్పటిదాకా వేచి చూడాలి.